Pervert Caught Beside Woman: ట్రైన్‌లో బరితెగించిన యువకుడు.. మహిళ పక్కన కూర్చుని పాడుపని..
ABN , Publish Date - Aug 28 , 2025 | 09:28 PM
ఓ యువకుడు ఆమె పక్కన వచ్చి కూర్చున్నాడు. కొద్దిసేపు మామూలుగానే ఉన్నాడు. తర్వాతి నుంచి పాడుపని మొదలెట్టాడు. ఆ మహిళకు మాత్రం కనిపించేలా.. బ్యాగు అడ్డం పెట్టుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ఈ మధ్య కాలంలో కామాంధులు పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నారు. కొంచెం కూడా భయం లేకుండా కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రోడ్డుపై క్యాబ్ కోసం నిల్చుని ఉన్న మోడల్‌తో ఓ యువకుడు తప్పుగా ప్రవర్తించాడు. నడిరోడ్డుపై.. అది కూడా పట్టపగలు పాడు పని చేశాడు. ఆ సంఘటన మరువక ముందే మరో దారుణమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ కామాంధుడు రైలులో మహిళతో తప్పుగా ప్రవర్తించాడు. ఆమె పక్కన కూర్చుని పాడుపని చేయటం మొదలెట్టాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో మంగళవారం చోటు చేసుకుంది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో థానే నుంచి వాసి వెళ్లడానికి హార్బర్ లైన్ ట్రైన్ ఎక్కింది. ఓ యువకుడు ఆమె పక్కన వచ్చి కూర్చున్నాడు. కొద్దిసేపు మామూలుగానే ఉన్నాడు. తర్వాతి నుంచి పాడుపని మొదలెట్టాడు. ఆ మహిళకు మాత్రం కనిపించేలా.. బ్యాగు అడ్డం పెట్టుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ వ్యక్తి ఎదురు సీట్లో కూర్చున్న ప్రయాణికుడు ఇది గమనించాడు. వీడియో తీయటం మొదలెట్టాడు. కొద్దిసేపటి తర్వాత ఆ మహిళకు విషయం చెప్పాడు. విషయం తెలిసి ఆమె గట్టిగా అరుస్తూ అతడిపై ఫైర్ అయింది. అతడ్ని చితక్కొట్టడం మొదలెట్టింది. అక్కడున్న వాళ్లు చూస్తూ నిల్చున్నారే తప్ప ఎవ్వరూ ఆమెకు మద్దతుగా రాలేదు.
కొద్దిసేపటి తర్వాత ఓ వ్యక్తి అక్కడకు వచ్చాడు. కామాంధుడిపై రెండు దెబ్బలు వేశాడు. దీంతో భయపడిపోయిన అతడు ట్రైన్ లోంచి కిందకు దూకేశాడు. అబ్‌రార్ షేక్ అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇలాంటి వాళ్లను ఊరికే వదిలేయకూడదు. అరబ్ దేశాల్లో శిక్షించినట్లు శిక్షించాలి’..‘ఈ మధ్యకాలంలో ఇలాంటి వారు ఎక్కువై పోయారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు