Share News

Dangerous Reel Video: రీల్స్ కంటే ప్రాణాలు ఎక్కువా.. ఈ పిల్లల తీరు చూస్తే భయపడాల్సిందే..

ABN , Publish Date - Aug 30 , 2025 | 06:55 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మందికి పాపులర్ అయిపోవాలనే ఆత్రుత విపరీతంగా పెరిగిపోయింది. భారీ సంఖ్యలో వ్యూస్, లైక్స్ తెచ్చుకునేందుకు జనాలు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో ప్రాణాంతక సాహసాలకు దిగుతున్నారు.

Dangerous Reel Video: రీల్స్ కంటే ప్రాణాలు ఎక్కువా.. ఈ పిల్లల తీరు చూస్తే భయపడాల్సిందే..
people risk lives for reel

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మందికి పాపులర్ అయిపోవాలనే ఆత్రుత విపరీతంగా పెరిగిపోయింది. భారీ సంఖ్యలో వ్యూస్, లైక్స్ తెచ్చుకునేందుకు జనాలు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో ప్రాణాంతక సాహసాలకు దిగుతున్నారు (viral reel video). ఆ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా చాలా మందిలో మార్పు రావడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కుర్రాళ్ల తీరు చూస్తే భయపడాల్సిందే (people risk lives for reel).


@Sparkes_hub అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్నఆ వీడియో ప్రకారం.. ముగ్గురు అబ్బాయిలు రైల్వే ట్రాక్ ఉన్న వంతెనపై నిలబడి ఉన్నారు. ఆ వంతెన కింద నది ఉంది. రైలు వచ్చే వరకు ఆ ముగ్గురు పిల్లలు ట్రాక్‌పై నిలబడి ఉన్నారు. రైలు బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ముగ్గురూ ఒక్కొక్కరుగా నదిలోకి దూకారు. కొన్ని సెకెన్లల వ్యవధిలో వారు ప్రాణాలను దక్కించుకున్నారు. లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగింది (shocking viral footage).


వారి సాహసాన్ని ఓ వ్యక్తి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (viral content sacrifice). ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను వేల మంది వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. వారు తమ ప్రాణాలను పట్టించుకోరని ఒకరు పేర్కొన్నారు. పిల్లలందరూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

వామ్మో.. ఒంటెకు ఇంత కోపం వస్తుందా.. డిస్ట్రబ్ చేసిన కుర్రాళ్లను ఏం చేసిందో చూడండి..

మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలోని ఉడతను 10 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 30 , 2025 | 06:55 PM