Hotel: పైన రోడ్డు... కింద హోటల్...
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:30 AM
వాహనాల రాకపోకలతో నిత్యం బిజీగా ఉండే రహదారి అది. రోడ్డు మధ్యలో ఒక చోట డివైడర్ దగ్గర చూస్తే ఇనుప రెయిలింగ్స్ కనిపిస్తాయి. కాస్త దగ్గరగా వెళితే... భూగర్భంలోకి వెళ్లేందుకు మెట్లు కనిపిస్తాయి. లోపలకు దిగి చూస్తే సకల సదుపాయాలతో ఉన్న హోటల్ స్వాగతం పలుకుతుంది.
ఆ రోడ్డుపైన వాహనాలు దూసుకుపోతుంటాయి. అక్కడే కొందరు రోడ్డు కింద, భూగర్భంలో పడకగదిలో కునుకు తీస్తుంటారు. అదెలా సాధ్యం అంటారా? యూకేలోని ఆక్స్‌ఫర్డ్ నగరంలో ఉన్న ‘నెట్టీ’ హోటల్‌లో బస చేస్తే అంతే. ఎందుకంటే ఆ హోటల్ ఉన్నది రోడ్డు మధ్యలో... అదీ భూగర్భంలో!
వాహనాల రాకపోకలతో నిత్యం బిజీగా ఉండే రహదారి అది. రోడ్డు మధ్యలో ఒక చోట డివైడర్ దగ్గర చూస్తే ఇనుప రెయిలింగ్స్ కనిపిస్తాయి. కాస్త దగ్గరగా వెళితే... భూగర్భంలోకి వెళ్లేందుకు మెట్లు కనిపిస్తాయి. లోపలకు దిగి చూస్తే సకల సదుపాయాలతో ఉన్న హోటల్ స్వాగతం పలుకుతుంది. కొన్ని దశాబ్దాల పాటు పబ్లిక్ టాయిలెట్‌గా ఉన్న ఆ ప్రదేశం ఇప్పుడు ఆకర్షణీయమైన హోటల్‌గా మారింది. యూకేలోని ఆక్స్‌ఫర్డ్ నగరంలో కనిపిస్తుందీ దృశ్యం. ఆ హోటల్ పేరు నెట్టీ. రోడ్డుపై ప్రయాణించే వారు చూస్తే అక్కడ ఏమీ కనిపించదు. రోడ్డు మధ్యలో ఇనుప రెయిలింగ్ ఉన్నచోట దగ్గరకు వెళ్లి చూస్తే భూగర్భంలోకి మెట్లు ఉంటాయి. ఆ మెట్ల గుండా లోపలకు వెళితే హోటల్ కనిపిస్తుంది. పదిహేడేళ్ల క్రితం హోటల్ ఉన్న ప్రదేశంలో పబ్లిక్ టాయిలెట్స్ ఉండేవంటే ఆశ్చర్యమేస్తుంది.

వందేళ్ల క్రితం....
అప్పట్లో స్థలం కొరత వల్ల అధికారులు రోడ్డు మధ్యలో, భూగర్భంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించారు. 1895లో విక్టోరియా పాలనలో నిర్మించిన ఆ మరుగుదొడ్లు కొన్ని దశాబ్దాల పాటు ప్రజలకు ఉపయోగపడ్డాయి. ఏళ్లు గడిచే కొద్దీ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో బాగా దెబ్బతిన్నాయి. భద్రతా కారణాల దృష్టా అధికారులు 2008లో వాటిని మూసివేశారు. మరో పదిహేడేళ్లు గడిచిపోయాయి. ఈ విషయం తెలిసిన ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన వ్యాపారవేత్త గ్విన్ హ్యారిస్ జోన్స్ వినియోగంలో లేని ఆ భూగర్భ స్థలాన్ని కొనుగోలు చేశారు. అక్కడి మరుగుదొడ్లు పూర్తిగా తొలగించి స్టార్ హోటల్‌ను తలదన్నే రీతిలో హోటల్ నిర్మాణం చేసి, ప్రారంభించారు.
‘‘ఈ హోటల్‌లో బస చేయడం ఒక మధురానుభూతిని అందిస్తుంది. వింతైన ప్రదేశాలలో ఇదొకటిగా గుర్తింపు పొందింది. ఈ హోటల్‌లో బస చేసేవారికి సకల సదుపాయాలు అందుబాటులో ఉంటాయి’’ అంటారు హోటల్ మేనేజర్ అనా పినిరో. అయితే ఈ హోటల్ రిసెప్షన్, రూమ్ సర్వీస్, రెస్టారెంట్ వంటి సదుపాయాలు ఉండవు. ఫోన్ చేస్తే ఆ సేవలన్నీ అందిస్తారు. ఒక్కరోజు బసకి రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయినా సరే వెరైటీ కోసం రోడ్డు మధ్య భూగర్భంలో ఉన్న హోటల్ ‘నెట్టీ’లో బసచేయడానికి పర్యాటకులు అమితాసక్తి కనబరుస్తుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కార్తీక మాసం పూర్తయ్యింది.. చికెన్, గుడ్డు రేట్లు అమాంతం పెరిగాయి
Read Latest Telangana News and National News