Share News

Viral Indian jugaad: భారతీయులు మాత్రమే ఇలా ఆలోచించగలరు.. ఈ తెలివి చూస్తే నవ్వుకోవాల్సిందే..

ABN , Publish Date - Aug 28 , 2025 | 06:13 PM

మన దేశంలో సామాన్యులు కూడా అద్భుతంగా ఆలోచించగలరు. క్లిష్టమైన సమస్యకు తమకు తోచిన రీతిలో సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. ఒక్కోసారి వారి తెలివి ఆశ్చర్యపరుస్తుంది. ఇంకొన్ని సార్లు నవ్వు తెప్పిస్తుంది. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Viral Indian jugaad: భారతీయులు మాత్రమే ఇలా ఆలోచించగలరు.. ఈ తెలివి చూస్తే నవ్వుకోవాల్సిందే..
viral Indian jugaad

మన దేశంలో సామాన్యులు కూడా అద్భుతంగా ఆలోచించగలరు. క్లిష్టమైన సమస్యకు తమకు తోచిన రీతిలో సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. ఒక్కోసారి వారి తెలివి ఆశ్చర్యపరుస్తుంది. ఇంకొన్ని సార్లు నవ్వు తెప్పిస్తుంది. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Indian innovation video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. గోధుమలను ఎండబెట్టేందుకు అతడు పాటించిన టెక్నిక్ చాలా మందిని ఆకట్టుకుంటోంది (desi jugaad viral).


miss pinki 15 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను (Indian creativity) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. సాధారణంగా గోధుమలు, వరి లేదా ఇతర పదార్థాలను కడిగిన తర్వాత ఎండలో ఉంచి ఎండబెడుతుంటారు. అయితే అలా చేయడం వల్ల పక్షులు వాటిని పాడుచేస్తాయి. కాకులు, పావురాలు వాటిని చెల్లాచెదురు చేసేస్తాయి. దీంతో ఓ వ్యక్తి తన ఇంట్లో వాడే దోమల తెరను గోధుమలకు రక్షణగా ఉంచారు. ఈ దోమతెర ఆ గోధుమలను పక్షుల నుంచి రక్షిస్తుంది (viral hack India).


ఈ జుగాడ్‌ను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. కొన్ని లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఇది మంచి టెక్నిక్ అని ఓ వ్యక్తి ప్రశంసించారు. ఆ ఐడియా ఇండియా దాటి వెలుపలకు వెళ్లకూడదని మరొకరు సరదాగా కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

ఈ పాము చాలా సంస్కారవంతమైనది.. మొబైల్‌లో అశ్లీల పాట చూసి ఏం చేసిందంటే..

రూ.100 పెట్టి షేర్ కొంటే.. రూ.3000 భోజనం ఫ్రీ.. ఆ రోజులు పోయాయంటే సీఏ ఆసక్తికర పోస్ట్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 28 , 2025 | 06:13 PM