Odisha YouTuber Drone Video: హద్దుదాటిన రీల్స్ పిచ్చి.. నిండు ప్రాణం గంగపాలు..
ABN , Publish Date - Aug 24 , 2025 | 06:28 PM
సాగర్ నీటిలోకి వెళ్లాడు. ఓ రాయిపై నిలబడి మిత్రుడితో వీడియో తీయించుకుంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే నీటి ప్రవాహం పెరిగింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు
సోషల్ మీడియాలో పాపులర్ కావాలన్న పిచ్చి జనాల ప్రాణాలు తీస్తోంది. ఒకప్పుడు ఇండియాలో టిక్‌టాక్ ఉండేది. టిక్‌టాక్‌లో ఫేమస్ కావాలన్న పిచ్చితో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. టిక్‌టాక్ బ్యాన్ అయిన తర్వాత ఆ స్థానాన్ని ఇన్‌స్టాగ్రామ్ తీసుకుంది. ఇన్‌స్టా రీల్స్ పిచ్చిలో చాలా మంది చనిపోతున్నారు. అయితే, అత్యంత అరుదుగా యూట్యూబ్ వీడియోల కోసం జనం పిచ్చి పనులు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు (Tourist Safety Concerns). తాజాగా, ఓ యూట్యూబర్ వీడియో కోసం వాటర్ ఫాల్‌లోకి దిగి కొట్టుకుపోయాడు.
ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గంజాం జిల్లాకు చెందిన సాగర్ తుబు అనే 22 ఏళ్ల యువకుడికి ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ట్రావెల్ వీడియోలు చేస్తూ ఉన్నాడు. సాగర్ తన మిత్రుడు అభిజిత్ బెహరాతో కలిసి శనివారం కోరపుట్ జిల్లాకు వెళ్లాడు. జిల్లాలోని పలు టూరిస్ట్ ప్రదేశాల్లో వీడియోలు చేశాడు. ఈ నేపథ్యంలోనే దుదుమా వాటర్ ఫాల్ (Duduma Waterfall) దగ్గరకు వెళ్లాడు. భారీ వర్షాల కారణంగా వాటర్ ఫాల్ పొంగిపొర్లుతోంది.
సాగర్ నీటిలోకి వెళ్లాడు. ఓ రాయిపై నిలబడి మిత్రుడితో వీడియో తీయించుకుంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే నీటి ప్రవాహం పెరిగింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు ( Drone Video Gone Wrong). కొంతమంది పర్యాటకులు, స్థానికులు అతడ్ని రక్షించే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు. పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం వెళ్లింది. వాటర్ ఫాల్ దగ్గరకు చేరుకున్న వారు సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టారు. వారికి కూడా సాగర్ కనిపించలేదు.
ఇవి కూడా చదవండి
మరీ ఇంత దారుణమా.. 1 కి.మీ రైడ్ కోసం 425 రూపాయలు..
షాపింగ్‌కు వెళ్లిన మహిళ.. వర్షం కురవడంతో కోటీశ్వరురాలైపోయింది..