Rs 425 Fare for Just 1 km: మరీ ఇంత దారుణమా.. 1 కి.మీ రైడ్ కోసం 425 రూపాయలు..
ABN , Publish Date - Aug 24 , 2025 | 05:40 PM
ఊబర్ ద్వారా రైడ్ బుక్ చేసుకోవాలనుకున్న అతడికి షాక్ తగిలింది. ఒక కిలోమీటర్ ప్రయాణం కోసం ఏకంగా 425 రూపాయలు చూపించింది. దీంతో కస్టమర్ రైడ్ బుక్ చేసుకోవటమే మానేశాడు.
ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఓలా, ఊబర్, ర్యాపిడ్ రైడ్ల హవా నడుస్తోంది. ప్రయాణాల కోసం జనాలు ఎక్కువగా వీటినే నమ్ముకుంటున్నారు. దేశంలో రోజు రోజుకు రైడ్ హెయిలింగ్ కంపెనీలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అయితే, వర్షాకాలం వచ్చిందంటే చాలు కస్టమర్లకు ఇబ్బందులు తప్పటం లేదు. రైడ్ హెయిలింగ్ యాప్‌లు రైడ్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నాయి. సాధారణంగా తీసుకునే దానికంటే డబుల్, త్రిబుల్ కూడా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. (Bengaluru Auto Fare)
బెంగళూరు లాంటి నగరాల్లో అయితే, కస్టమర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా, ఓ కస్టమర్‌కు దారుణమైన అనుభవం ఎదురైంది. ఊబర్ ద్వారా రైడ్ బుక్ చేసుకోవాలనుకున్న అతడికి షాక్ తగిలింది. ఒక కిలోమీటర్ ప్రయాణం కోసం ఏకంగా 425 రూపాయలు చూపించింది (Uber Surge Pricing). దీంతో కస్టమర్ రైడ్ బుక్ చేసుకోవటమే మానేశాడు. కస్టమర్ ఫ్రెండ్ తన రెడ్డిట్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో.. ‘నిన్న రాత్రి వర్షం పడుతూ ఉంది. నా ఫ్రెండ్ ఊరికి వెళ్లడానికి ఆటో బుక్ చేసుకోవాలని చూశాడు.
ధరలు చూసి షాక్ అయ్యాడు. వెంటనే గొడుగు పట్టుకుని నడుచుకుంటూ వెళ్లిపోయాడు. జర్మన్‌లో బెంజ్ టాక్సీలు ఉంటాయి. వాటిలో ప్రయాణం కోసం కిలోమీటర్‌కు ఇంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆటో కొనడానికి ఇదే మంచి సమయం. నేను అమెరికాలో ఉన్నపుడు ఊబర్, లిఫ్ట్ క్యాబ్స్(Cab Aggregator) కోసం ఇంతే చెల్లించేవాడిని. ఇక్కడి ధరలు చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇకపై తక్కువ దూరాలకు మనం మన కాళ్లను, సైకిళ్లను నమ్ముకోవాల్సిన సమయం వచ్చింది’ అని అన్నాడు.

ఇవి కూడా చదవండి
షాపింగ్‌కు వెళ్లిన మహిళ.. వర్షం కురవడంతో కోటీశ్వరురాలైపోయింది.
మొలకెత్తిన గింజల్ని పచ్చిగా తింటే మేలా? ఉడక బెట్టి తింటే మేలా?