Share News

Filming Instagram Reel: బాలుడి ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి.. రైల్వే ట్రాక్‌పై నిలబడి..

ABN , Publish Date - Oct 23 , 2025 | 03:32 PM

ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో విశ్వజీత్ ఓ పిచ్చి పని చేశాడు. రీల్స్ కోసం వీడియో తీయడానికి రైల్వే ట్రాక్ మీదకు వెళ్లాడు. ఆ ట్రాక్‌పై రైలు వస్తున్నా పక్కకు వెళ్లకుండా సెల్ఫీ వీడియో తీసుకుంటూనే ఉన్నాడు.

Filming Instagram Reel: బాలుడి ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి.. రైల్వే ట్రాక్‌పై నిలబడి..
Filming Instagram Reel

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిపోయింది. సోషల్ మీడియాతో గుర్తింపు, డబ్బు సంపాదించడానికి కొంతమంది పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. పిచ్చి పనుల కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా లేకపోలేదు. తాజాగా, ఓ బాలుడు రీల్స్ పిచ్చి కారణంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. రైల్వే ట్రాక్‌పై నిలబడి రీల్స్ చేస్తుండగా రైలు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన ఒడిశాలో మంగళవారం చోటుచేసుకుంది.


ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళఘాట్‌కు చెందిన విశ్వజీత్ సాహూ మంగళవారం తన తల్లితో కలిసి దక్షిణ కాళీ గుడికి వెళ్లాడు. అయితే, ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో విశ్వజీత్ ఓ పిచ్చి పని చేశాడు. రీల్స్ కోసం వీడియో తీయడానికి రైల్వే ట్రాక్ మీదకు వెళ్లాడు. ఆ ట్రాక్‌పై రైలు వస్తున్నా పక్కకు వెళ్లకుండా సెల్ఫీ వీడియో తీసుకుంటూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే రైలు అతడ్ని ఢీకొట్టింది. దూరంగా ఎగిరిపడి అక్కడికక్కడే చనిపోయాడు.


సమాచారం అందుకున్న వెంటనే ఒడిశా రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. విశ్వజీత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ మధ్య కాలంలో ఇలాంటివి సర్వ సాధారణం అయిపోయాయి’..‘ఒకప్పుడు టిక్‌టాక్ పిచ్చితో చాలా మంది బలయ్యారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వల్ల చనిపోతున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

నడి రోడ్డుపై రెచ్చిపోయిన నటి.. టపాసుల షాపులోంచి..

మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదేనా?

Updated Date - Oct 23 , 2025 | 05:27 PM