Khushi Mukherjee Viral Video: నడి రోడ్డుపై రెచ్చిపోయిన నటి.. టపాసుల షాపులోంచి..
ABN , Publish Date - Oct 23 , 2025 | 02:51 PM
నటి ఖుషీ ముఖర్జీ షాపులోని టపాసుల్ని తీసి రోడ్డుపై పడేసింది. అటు వైపు వచ్చిన పోలీసుతో కూడా ఆమె గొడవ పెట్టుకుంది. పోలీసు ఎంత చెప్పినా ఆమె వినలేదు. ఇక, ఖుషీ చర్యలతో షాపు అతడికి విపరీతమైన కోపం వచ్చింది.
బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ నడి రోడ్డుపై రచ్చ రచ్చ చేశారు. రోడ్డు పక్కన టపాసుల షాపు పెట్టుకున్న వ్యక్తిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బూతులు తిడుతూ రెచ్చిపోయారు. షాపులోని టపాసుల్ని రోడ్డుపై పడేశారు. ఈ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఖుషీ ముఖర్జీ తన బెంజ్ కారులో అంథేరీలోని రోడ్డుపై వెళుతోంది. కారు లోఖండేవాలా ఏరియాలోకి రాగానే ఓ చిన్న యాక్సిడెంట్ జరిగింది.
బెంజ్ కారును ఆటో ఢీకొట్టింది. కారు అత్యంత స్వల్పంగా డ్యామేజ్ అయింది. ఆటో డ్రైవర్ ఆటో ఆపకుండా వెళ్లిపోయాడు. ఆమె కారును రోడ్డు పక్కన ఆపి కిందకు దిగింది. కారుకు పడ్డ డెంట్‌ను చూసి ఖుషీ కోపం కట్టలు తెంచుకుంది. పక్కనే ఉన్న టపాసుల షాపు యజమానిపై ఫైర్ అయింది. ‘అందరూ దీపావళి పండుగ జరుపుకోవాలి. ఆటో అతను నా కారును ఢీకొట్టి వెళ్లిపోయాడు. నువ్వేమో రోడ్డుపై టపాసులు అమ్ముతూ ఉన్నావు’ అంటూ మండిపడింది.
అతడ్ని బాగా తిట్టింది. ఆ షాపులోని టపాసుల్ని తీసి రోడ్డుపై పడేసింది. అటు వైపు వచ్చిన పోలీసుతో కూడా ఆమె గొడవ పెట్టుకుంది. పోలీసు ఎంత చెప్పినా ఆమె వినలేదు. ఇక, ఖుషీ చర్యలతో షాపు అతడికి విపరీతమైన కోపం వచ్చింది. ‘చాలా ఓవర్ చేస్తోంది. ఆమెకు ఎవరైనా చెప్పండి. లేదంటే దెబ్బలు తింటుంది ఇప్పుడు’ అంటూ గట్టిగానే అన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఖుషీ అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన సరిగ్గా ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
చీకటి నింపిన దీపావళి.. 125 మంది కళ్ళకు గాయాలు.. ఏమైందంటే?
మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదేనా?