Share News

Idli 20 Paise Lunch 50 Paise: హోటల్ బంపర్ ఆఫర్.. ఇడ్లీ 20 పైసలు.. భోజనం 50 పైసలు

ABN , Publish Date - Aug 21 , 2025 | 09:53 PM

Idli 20 Paise Lunch 50 Paise: మీ జేబిలో ఓ వెయ్యి రూపాయలు ఉంటే.. ఆ హోటల్‌లోని అన్ని ఫుడ్ ఐటమ్స్ కొనుక్కుని తినేయొచ్చు. కేవలం ఒక రూపాయతో మీ కడుపు నిండిపోతుంది.

Idli 20 Paise Lunch 50 Paise: హోటల్ బంపర్ ఆఫర్.. ఇడ్లీ 20 పైసలు.. భోజనం 50 పైసలు
Idli 20 Paise Lunch 50 Paise

ఓ హోటల్ తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. డెడ్ చీప్‌లో పుడ్ ఐటమ్స్ అందించింది. మీ జేబిలో ఓ వెయ్యి రూపాయలు ఉంటే.. ఆ హోటల్‌లోని అన్ని ఫుడ్ ఐటమ్స్ కొనుక్కుని తినేయొచ్చు. కేవలం ఒక రూపాయతో మీ కడుపు నిండిపోతుంది. ఆ హోటల్‌లో ఇడ్లీ కేవలం 20 పైసలు మాత్రమే.. ఇక, భోజనమైతే చాలా చీప్ .. 50 పైసలు మాత్రమే. ఆ హోటల్ ఎక్కడో తెలుసుకోవాలని ఉందా?.. అయితే, ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ మొత్తం స్టోరీ చదవాల్సిందే.


మహారాష్ట్ర, ముంబైలోని గోరేగావ్‌లో ఉడిపి విహార్ అనే హోటల్ ఉంది. ఆ హోటల్‌‌ను ప్రారంభించి 60 ఏళ్లు అవుతోంది. అయితే, ఆ హోటల్‌‌ను పడగొట్టి దాని స్థానంలో కొత్తదాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంతో కాలం నుంచి హోటల్‌ను ఆదరిస్తూ.. హోటల్ సక్సెస్‌కు కారణమైన కస్టమర్ల కోసం ఉడిపి విహార్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. హోటల్‌ను ప్రారంభించిన రోజు ఫుడ్ ఐటమ్స్ ధరలు ఎంతైతే ఉన్నాయో అంతే ధరకు అందిస్తున్నట్లు ప్రకటించింది.


అయితే, ఆ ఆఫర్ ఎప్పుడో అయిపోయింది. ఆగస్టు 18న ఆగస్టు ప్రకటించగా.. పెద్ద సంఖ్యలో జనం హోటల్‌కు క్యూ కట్టారు. భారీ వర్షం పుడుతున్నా సరే.. హోటల్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఒక రోజు ఆఫరా.. నాకు తెలిసి ఉంటే నా గ్యాంగ్ మొత్తాన్ని తీసుకెళ్లే వాడ్ని’..‘ఆ రోజులే బాగుండేవి.. చాలా చీప్‌ ధరలతో భోజనం చేసేవాళ్లు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

చెరువులో తవ్వుతుండగా కళ్లు జిగేల్.. బయటపడ్డ డైనోసార్ శిలాజాలు..

జైల్లో పరిచయం.. విడుదలైన నెల రోజులకే పెళ్లి ఇంట్లో కన్నం..

Updated Date - Aug 21 , 2025 | 09:53 PM