Snake and Rat: ఈ ఎలుక పాము కంటే తెలివైంది.. తన ప్రాణాలను ఎలా కాపాడుకుందో చూడండి..
ABN , Publish Date - Jul 13 , 2025 | 05:48 PM
మృత్యువు ఎదురుగా ఉన్నప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి ఎవరైనా రకరకాల ప్రయత్నాలు చేస్తారు. తమ బుర్రకు పదును పెట్టి ప్రాణాలను కాపాడుకుంటారు. అందుకు చిన్నచిన్న జంతువులు కూడా అతీతం కాదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో చిన్ని ఎలుక చేసిన పని చాలా మందిని ఆకట్టుకుంటోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రాణం అంటే మనుషులకే కాదు.. జంతువులకూ ఎంతో తీపి. మృత్యువు ఎదురుగా ఉన్నప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి ఎవరైనా రకరకాల ప్రయత్నాలు చేస్తారు. తమ బుర్రకు పదును పెట్టి ప్రాణాలను కాపాడుకుంటారు. అందుకు చిన్నచిన్న జంతువులూ అతీతం కాదు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో చిన్ని ఎలుక (Rat) చేసిన పని చాలా మందిని ఆకట్టుకుంటోంది. పాము (Snake) నుంచి తప్పించుకునేందుకు ఎలుక అద్భుతమైన ప్లాన్ వేసింది.
@Shikhar_India అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. సాధారణంగా కప్పలు, ఎలుకలను పాములు ఆహారంగా తింటాయి. పాము కంట పడితే ఎలుక ప్రాణం మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఆ విషయం తెలిసిన ఓ ఎలుక అద్భుతమైన ప్లాన్ వేసింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ భారీ సర్పం పడగ ఎత్తి చూస్తోంది. సరిగ్గా దాని తల మీద ఓ ఎలుక కూర్చుని ఉంది. ఆ పాముకు ఎలుక ఎక్కడుందో అర్థం కావడం లేదు. అటూ ఇటూ వెతుకుతోంది తప్ప ఎలుక ఎక్కడుందో కనుక్కోలేకపోయింది.
పాము పడగ నుంచి కిందకు పడిపోయిన ఎలుక మెల్లిగా మళ్లీ పైకి ఎక్కి కూర్చుంది. దీంతో ఆ పాము ఎలుక ఉనికిని కనుక్కోలేకపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలోని ఎలుక తెలివిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ ఎలుక తన తెలివితో ప్రాణాలను కాపాడుకుందని ఒకరు కామెంట్ చేశారు. చివరి వరకు ఆశతో పోరాడితే విజయం సాధ్యమవుతుందనే సందేశం ఈ వీడియోలో ఉందని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మంచులో ఆగి ఉన్న కారు.. మూడు పులులు ఏం చేశాయో చూడండి.. వీడియో వైరల్
మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ కుక్కల మధ్యలో సీతాకోకచిలుకను 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..