Shocking Video: చావు అంచుల వరకు వెళ్లొచ్చాడు.. చిన్న తప్పు ఎంత పెద్ద ప్రమాదానికి కారణమైందో చూడండి..
ABN , Publish Date - Jul 13 , 2025 | 04:31 PM
సోషల్ మీడియా వ్యూస్ కోసం కొందరు ప్రమాదాలతో ఆటలాడుతున్నారు. భారీ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు మన కళ్ల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే నివ్వెరపోక తప్పదు. ఆ వీడియోలోని ఓ కుర్రాడు చేసిన పని చాలా పెద్ద ప్రమాదానికి కారణమైంది.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కొన్ని లైక్స్, వ్యూస్ కోసం జనాలు ఏం చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు. ప్రమాదాలతో ఆటలాడుతున్నారు (Dangerous stunt). ఆ క్రమంలో భారీ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు మన కళ్ల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే నివ్వెరపోక తప్పదు. ఆ వీడియోలోని ఓ కుర్రాడు చేసిన పని చాలా పెద్ద ప్రమాదానికి కారణమైంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు (Viral Video).
b_mem_fun అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కుర్రాడు నిప్పుతో (Fire) చెలగాటం ఆడడానికి రెడీ అవుతున్నాడు. అతడు చేతిలో ఓ లైటర్‌ను వెలిగించి పట్టుకున్నాడు. మరో లైటర్ (Lighter)ను నోటిలో దంతాల మధ్య పెట్టుకుని గట్టిగా కొరికేశాడు. దీంతో ఆ లైటర్‌లోని వాయువుకు నిప్పు తగిలి మంటలు చెలరేగాయి. దీంతో ఆ కుర్రాడి మొహానికి మంటలు అంటుకున్నాయి. అతడు హాలీవుడ్ సినిమా ఘోస్ట్ రైడర్ (Ghost Rider)లా మారిపోయాడు. అయితే వెంటనే అతడు మంటలను ఆర్పేసుకోవడంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ అతడి పెదవులు మాత్రం కాలిపోయాయి. ఈ ప్రమాదకరమైన స్టంట్ చూసిన ప్రజలు భయపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు కోట్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 18 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. అతడు మరణం అంచుల వరకు వెళ్లి వెనక్కి వచ్చాడని ఒకరు కామెంట్ చేశాడు. ప్రాణాలతో ఆడుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సరదా కాదు అని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మంచులో ఆగి ఉన్న కారు.. మూడు పులులు ఏం చేశాయో చూడండి.. వీడియో వైరల్
మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ కుక్కల మధ్యలో సీతాకోకచిలుకను 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..