Share News

Theft Video: ఇదెక్కడి దొంగతనంరా బాబూ.. వేగంగా వెళ్తున్న రైలులో నుంచి మొబైల్ ఎలా కొట్టేశాడో చూడండి..

ABN , Publish Date - Jul 13 , 2025 | 04:16 PM

రైలు ప్రయాణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రైలు ప్రయాణ సమయంలో ఏదైనా పోగొట్టుకుంటే దానిని తిరిగి పొందడం కష్టం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఇలా కూడా దొంగతనాలు జరుగుతాయా అని ఆశ్చర్యపోవడం ఖాయం.

Theft Video: ఇదెక్కడి దొంగతనంరా బాబూ.. వేగంగా వెళ్తున్న రైలులో నుంచి మొబైల్ ఎలా కొట్టేశాడో చూడండి..
thief steals phone from moving train

ప్రయాణ సమయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తారు. ఇటీవలి కాలంలో డబ్బులను చోరీ చేసే అవకాశం దొరకడం లేదు. దీంతో చాలా మంది మొబైల్ ఫోన్లను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా రైలు ప్రయాణ (Train Journey) సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. రైలు ప్రయాణ సమయంలో ఏదైనా పోగొట్టుకుంటే దానిని తిరిగి పొందడం కష్టం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఇలా కూడా దొంగతనాలు (Theft) జరుగుతాయా అని ఆశ్చర్యపోవడం ఖాయం.


ఈ వీడియో పలు సామాజిక మాధ్యమ హ్యాండిల్స్‌లో షేర్ అయింది. బీహార్‌ (Bihar)లోని బెగుసరాయ్‌లోని రాజేంద్ర వంతెనపై పాట్నా-కతిహార్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ వంతెనకు వేలాడుతూ కొందరు వ్యక్తులు దొంగతనాలకు (Mobile Theft) పాల్పడుతున్నారు. రైలు గేట్ల దగ్గర కూర్చున్న వారి చేతుల్లో మొబైల్స్ ఉంటే వాటిని లాగేసుకుంటున్నారు. ఈ బ్రిడ్జ్ దొంగతనాలకు వేదికగా మారింది. ఈ దొంగతనాలపై ఇప్పటికే పోలీసులకు చాలా ఫిర్యాదులు అందాయి. అయితే వారిని పట్టుకోవడం పోలీసులకు కూడా తలకు మించిన భారంగా మారుతోందట.


మొబైల్ దొంగలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి వెళితే వారు వంతెన కింద ఉన్న గంగా నదిలోకి దూకేసి ఈదుకుంటూ వెళ్లిపోతున్నారట. దీంతో పోలీసులు వారిని పట్టుకోలేకపోతున్నారు. ఆ బ్రిడ్జ్‌పై రైలు వెళ్లే సమయంలో డోర్‌ల దగ్గర ఎవరూ ఉండకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆ బ్రిడ్జ్‌పై జరిగిన దొంగతనలకు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ బ్రిడ్జ్‌పై జరిగిన దొంగతనానికి సంబంధించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి..

మంచులో ఆగి ఉన్న కారు.. మూడు పులులు ఏం చేశాయో చూడండి.. వీడియో వైరల్


మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ కుక్కల మధ్యలో సీతాకోకచిలుకను 5 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 13 , 2025 | 04:16 PM