Marriage: పెళ్లి తరువాత ఈ తప్పులు చేస్తే భార్యాభర్తల బంధానికి బీటలు!
ABN , Publish Date - Jan 04 , 2025 | 11:59 AM
వివాహబంధం కలకాలం నిలిచుండాలంటే కొన్ని పొరాపట్లు అస్సలు చేయొద్దని అనుభవజ్ఞులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

పెళ్లి అంటే ఓ అందమైన భంధమే కానీ దీన్ని నిలబెట్టుకునేందుకు కొంత శ్రమ పడాలి. కేవలం ప్రేమతో భార్యాభర్తల బంధం నిలబడదని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో కలలతో వివాహ జీవితంలో అడుగుపెట్టేవారు కొన్ని తప్పులు చేస్తే మాత్రం కలలన్నీ కల్లలైపోతాయని హెచ్చరిస్తున్నారు (Relationship).
వివాహబంధానికి పెళ్లి ఎంత అవసరమో, స్నేహం కూడా అంతే అవసరం. భార్యాభర్తలు ఒకరికొరు స్నేహితులుగా ఉండాలి. సరదాగా నవ్వుకోవడాలు, జోక్స్ చెప్పుకోవడాలు వంటివి స్నేహాన్ని పెంపొందిస్తాయి.
వయసు పెరిగిందనో లేదా పెద్దలు ఒత్తిడి చేస్తున్నారనో పెళ్లికి సిద్ధపడొద్దు. సరైన జోడీ దొరికాకే వివాహజీవితాన్ని ప్రారంభించాలి. అయితే, అలివిమాలిన అంచనాలు కూడా జీవితాన్ని నాశనం చేస్తాయన్న విషయం మర్చిపోవద్దు.
Psychological Games: పురుషులు మహిళలపై ప్రయోగించే మైండ్ గేమ్స్ ఇవే!
ప్రేమ అంటే అవతలి వాళ్లు మనం చెప్పినట్టు వినాలన్న భావన తప్పు. ఇలాంటి బంధాలతో భాగస్వాములు ఉక్కిరిబిక్కిరయ్యే అవకాశం ఉంది.
మౌనం అన్ని సమస్యలకు పరిష్కారం కాదన్న విషయాన్ని గుర్తెరగాలి. జీవితభాగస్వామితో మనసు విప్పి మాట్లాడాలి. నిజాయితీతో జరిపే సంభాషణలు బంధాల్ని బలపరుస్తాయి.
Life Style: అమ్మాయిని తొలిసారి చూస్తే అబ్బాయిలు ఇవి గమనిస్తారా!
రూజువారి కార్యక్రమాల్లో పడి జీవితభాగస్వామిని నిర్లక్ష్యం చేయొద్దు. జీవితాంతం మనతోనే ఉంటారుగా అన్న భావనతో తగినంత శ్రద్ధ పెట్టకపోతే బంధం బలహీనపడుతుంది. చివరకు శాశ్వతంగా తెగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
జీవితభాగస్వామే లోకం అన్నట్టు జీవించకూడదు. ఎవరి గురించి వారు కూడా శ్రద్ధ తీసుకోవాలి. మనుషుల ఆనందంగా ఉంటే ఆ సంతోషం బంధాల్లోనూ ప్రతిబింబిస్తుంది.
Love Bombing: ప్రేమలో పడ్డారా? మీ పార్ట్‌నర్ ఇలాంటి వారైతే జీవితం నాశనం!
రోమాన్స్ అనేది కేవలం హనీమూన్ దశకే పరిమితం కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఆ సాన్నిహిత్యం జీవితాంతం కొనసాగేలా చర్యలు తీసుకోవాలి. భార్యాభర్తలిద్దరూ అప్పుడప్పుడూ సరదాగా షికార్లకు, రెస్టారెంట్లకు వెళుతుండాలి. ఒకరినొకరు బహుమతులతో సర్‌ప్రైజ్ చేసుకుంటూ ఉండాలి. మనసులో ప్రేమను అక్షరాలుగా కూడా బయటపెట్టి అవతలి వారిని సర్‌ప్రైజ్ చేయొచ్చు.
కాబట్టి పెళ్లంటే అనేక ఊహించని అనేక మలుపులు ఉండే ప్రయాణమని గుర్తుంచుకోవాలి. వీలైనంత వరకూ పొరపాట్లు చేయకుండా, తప్పు జరిగినప్పుడు సరిదిద్దుకుంటూ ముందుకు సాగితే వివాహబంధాన్ని పదిలపరుచుకోవచ్చు.
USA: పొరపాటున కీలక అవయవాన్ని తొలగించిన డాక్టర్.. రోగి మృతి!
Love Mistakes: మీరు ప్రేమలో ఉన్నారా? పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. చాలా నష్టపోతారు..!
Relationship: భార్యాభర్తలు రాత్రి సమయంలో ఈ విషయాలు తప్పనిసరిగా మాట్లాడుకోవాలట..!