Elon Musk-Suleyman Mustafa: వామ్మో.. ఎలాన్ మస్క్ ట్రోల్ చేస్తే దిమ్మతిరగాల్సిందే.. మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓకు షాక్
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:23 PM
ఎంతో ప్రయాస పడి డాటా సెంటర్ ఏర్పాటు చేశామన్న మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తాఫా సులేమాన్‌ను ఎలాన్ మస్క్ దారుణంగా ట్రోల్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది. జస్ట్ ఒక్క వాక్యంతో మస్క్ వేసిన సెటైర్‌కు జనాలు కడుపుబ్బా నవ్వుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏఐ జమానాలో డాటా సెంటర్ల అవసరం విపరీతంగా పెరిగిపోయింది. బడా కంపెనీలన్నీ భారీ డాటా సెంటర్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తాఫా సులేమాన్ తమ డాటా సెంటర్ గురించి ఘనంగా చెప్పుకున్నారు. నెట్టింట ఆయన పెట్టిన పోస్టు చూసి టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ ఓ రేంజ్‌లో ట్రోలింగ్‌కు దిగారు. జస్ట్ ఒకే ఒక కామెంట్‌తో సులేమాన్‌కు షాకిచ్చారు (Elon Musk Suleyman Mustafa Trolling).
అమెరికా అట్లాంటా రాష్ట్రంలో ఫెయిర్ వాటర్ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్ ఇటీవల ఓ డాటా సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ విశేషాలను సులేమాన్ నెట్టింట పంచుకున్నారు. ‘అట్లాంటాలో డాటాసెంటర్ ఏర్పాటు కోసం 15 మిలియన్‌ల పని గంటలు పట్టింది. పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుంది’ అని గొప్పగా చెప్పుకున్నారు. ఎంతటి భారీ స్థాయిలో తమ డాటా సెంటర్ ఏర్పాటు చేశామో చెప్పుకునే క్రమంలో న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌తో పోలిక తెచ్చారు. ఈ భారీ భవనం నిర్మాణానికి కేవలం 7 మిలియన్ పని గంటలే అవసరమైందని అన్నారు (Microsoft fairwater data center).
ఈ పోస్టుకు మస్క్ ఊహించని రేంజ్‌లో రిప్లై ఇచ్చారు. ‘మీరు తప్పులేమైనా చేస్తున్నారేమో ఓసారి చెక్ చేసుకోండి’ అంటూ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు. అంటే.. డాటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైనదాని కంటే ఎక్కువ సమయం పట్టిందని మస్క్ సెటైరికల్‌గా తెలియజేశారు.
గతేడాది మస్క్ తన డాటా సెంటర్‌ను కేవలం 19 రోజుల్లో ఏర్పాటు చేశారు. మైక్రోచిప్స్ తయారీ సంస్థ ఎన్‌వీడియా సీఈఓ జెన్‌సెన్ హువాంగ్ కూడా ఆశ్చర్యపోయేలా చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మస్క్‌పై జెన్‌సెన్ ప్రశంసలు కురిపించారు. ‘నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఇలాంటి ఫీట్ చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎలాన్ మస్క్. ఇంజినీరింగ్, నిర్మాణం, వనరుల సమీకరణ, భారీ కంప్యూటర్ వ్యవస్థలపై మస్క్‌కు ఉన్న అవగాహన మరెవ్వరికీ లేదు’ అని ప్రశంసించారు.
ఇవీ చదవండి:
ఏసీ కోచ్‌లో జర్నీ.. రాత్రంతా గాఢ నిద్ర.. తెల్లారి లేచే సరికి..
వందేభారత్ స్లీపర్.. గాస్లు నిండా నీరు.. చుక్క నీరు కూడా ఒలకలేదుగా!