Mexican Senate Erupts In Brawl: అసెంబ్లీలో గొడవ.. కొట్టుకున్న ప్రతిపక్ష, అధికార పార్టీ నాయకులు..
ABN , Publish Date - Aug 29 , 2025 | 06:02 PM
గెరార్డో ఫెర్నాండెజ్ నోరోనా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. అలెగ్జాండ్రో మెరోనో ఆయన్ని అడ్డుకున్నారు. చెయ్యి పట్టి ఆపారు. దీంతో గొడవ మొదలైంది.
మెక్సికో సెనేట్‌లో ప్రతిపక్ష నేత, పీఆర్ఐ పార్టీ అధ్యక్షుడు అలెగ్జాండ్రో మెరోనో.. సెనేట్ ప్రెసిడెంట్, అధికార పార్టీ నేత గెరార్డో ఫెర్నాండెజ్ నోరోనాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గురువారం మెక్సికో సెనేట్‌లో యూఎస్ మిలటరీ గురించి చర్చ జరిగింది. ప్రతిపక్షం, అధికార పక్షం నాయకులు తీవ్రంగా వాదించుకున్నారు. సభ ముగిసిన తర్వాత జాతీయ గీతాన్ని ప్లే చేశారు. అలెగ్జాండ్రో మెరోనో జాతీయ గీతం ప్లే అవ్వటం ఆగిపోగానే గెరార్డో ఫెర్నాండెజ్ నోరోనాతో వాదులాటకు దిగారు.
ఇద్దరూ గట్టిగా అరుచుకున్నారు. గెరార్డో ఫెర్నాండెజ్ నోరోనా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. అలెగ్జాండ్రో మెరోనో ఆయన్ని అడ్డుకున్నారు. చెయ్యి పట్టి ఆపారు. దీంతో గొడవ మొదలైంది. అలెగ్జాండ్రో మెరోనో.. గెరార్డోను పక్కకు తోసేశారు. తీవ్ర ఆవేశంతో గెరార్డోను కొట్టసాగారు. అక్కడే ఉన్న పచ్చ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి వారి మధ్యలోకి వచ్చాడు. గొడవను ఆపే ప్రయత్నం చేశాడు. అలెగ్జాండ్రో అతడ్ని కూడా తోసి పడేశారు. ఆ వ్యక్తి దూరంగా వెళ్లిపడ్డాడు. అలెగ్జాండ్రో అంతటితో ఆగకుండా గెరార్డోపై దాడికి దిగారు. మిగిలిన సెనేటర్లు మధ్యలోకి వచ్చి ఆపే ప్రయత్నం చేశారు.
అయినా కూడా ఆయన ఆగలేదు. గెరార్డో చొక్కా పట్టుకుని లాగుతూ కొట్టడానికి ప్రయత్నించారు. అక్కడున్న వారు ఆయనకు సర్ధి చెప్పి గొడవ ఆపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ రాజకీయ నాయకులకు ఇదే పని. ప్రజల గురించి పని చేయాల్సింది పోయి రాజకీయాల కోసం కొట్టుకుంటూ ఉంటారు’.. ‘ఇండియాలోనే అనుకున్నా.. బయటి దేశాల్లో కూడా పరిస్థితి అలానే ఉందా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
తీవ్ర విషాదం.. ఇన్‌స్టంట్ న్యూడిల్స్ తిని బాలుడు మృతి..
భార్య చనిపోతే ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు మూడో పెళ్లి కావాలట..