Raw Instant Noodles: తీవ్ర విషాదం.. ఇన్‌స్టంట్ న్యూడిల్స్ తిని బాలుడు మృతి..
ABN , Publish Date - Aug 29 , 2025 | 05:07 PM
30 నిమిషాల్లోనే విషాదం చోటుచేసుకుంది. బాలుడి కడుపులో నొప్పి మొదలైంది. వాంతులు చేసుకోవటం మొదలెట్టాడు. విపరీతమైన చెమటలు పట్టి చనిపోయాడు.
సోషల్ మీడియా ట్రెండ్ ఫాలో అయిన ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇన్‌స్టంట్ న్యూడిల్స్ ఆ బాలుడ్ని బలి తీసుకున్నాయి. ఈ సంఘటన ఈజిప్టులో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కైరోలో ప్రస్తుతం ఓ ట్రెండ్ నడుస్తోంది. జనం ఉడకబెట్టని ఇన్‌స్టంట్ న్యూడిల్స్ తిని, ఆ వీడియోలను తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేస్తున్నారు. ఎల్ మర్గ్ జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలుడు ఈ ట్రెండ్‌ను ఫాలో అయ్యాడు. ఆగస్టు 25వ తేదీన మూడు ఇన్‌స్టంట్ న్యూడిల్స్ కొని ఇంటికి తెచ్చుకున్నాడు.
వాటిని ఓపెన్ చేసి ఉడకబెట్టకుండా తినేశాడు. 30 నిమిషాల్లోనే విషాదం చోటుచేసుకుంది. బాలుడి కడుపులో నొప్పి మొదలైంది. వాంతులు చేసుకోవటం మొదలెట్టాడు. విపరీతమైన చెమటలు పట్టి చనిపోయాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ న్యూడిల్స్‌లో సమస్య ఉందేమోనని భావించారు. సాంపిల్స్‌ను కలెక్ట్ చేసి పరీక్షకు పంపారు. ఆ పరీక్షల్లో న్యూడిల్స్‌లో ఎలాంటి సమస్య లేదని తేలింది. బాలుడి పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయం బయటపడింది. ఉడకబెట్టని న్యూడిల్స్ తినటం వల్ల అక్యూట్ బోవెల్ ఎమర్జెన్సీ వచ్చి బాలుడు మరణించాడని తేలింది.
ఉడకబెట్టని న్యూడిల్స్ తింటే చనిపోతారా?
ఉడకబెట్టని ఇన్‌స్టంట్ న్యూడిల్స్ పెద్ద మొత్తంలో తినటం అత్యంత ప్రమాదకరం. మనం వాటిని తిన్న తర్వాత కడుపులోకి వెళ్లి ఉబ్బిపోతాయి. తద్వారా పేగుల్లో అడ్డుపడిపోతాయి. డీహైడ్రేషన్, కడుపులో తీవ్రమైన ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. బాలుడి విషయంలో ఉడకబెట్టని ఇన్‌స్టంట్ న్యూడిల్స్ ప్రాణాలు తీశాయి. న్యూడిల్స్‌ను ఉడకబెట్టి తినటమే ఉత్తమం.
ఇవి కూడా చదవండి
భార్య చనిపోతే ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు మూడో పెళ్లి కావాలట..
స్టీరింగ్ మరో డ్రైవర్‌కు ఇచ్చి పడుకున్నాడు.. నిద్రలో ఉండగానే..