Bus Driver Heart Attack: స్టీరింగ్ మరో డ్రైవర్‌కు ఇచ్చి పడుకున్నాడు.. నిద్రలో ఉండగానే..
ABN , Publish Date - Aug 29 , 2025 | 03:30 PM
సతీష్ డ్రైవర్ సీటు పక్కన కూర్చుని నిద్రపోతూ ఉన్నాడు. సరిగ్గా గంట తర్వాత అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఛాతిలో నొప్పితో గిలగిల్లాడసాగాడు. ఇది గుర్తించిన బస్సులోని వారు అతడికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు.
ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వాళ్ల వరకు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు బారినపడి మరణిస్తున్నారు. అప్పటి వరకు ఎంతో హుషారుగా నవ్వుతూ, తుళ్లుతూ.. ఆడుతూ, పాడుతూ ఉన్నవాళ్లే ఠక్కున ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, ఓ బస్ డ్రైవర్ గుండెపోటు బారిన పడి మరణించాడు. అయితే, అతడు చేసిన ఓ పని కారణంగా బస్సులోని వారందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
సతీష్ రావు అనే వ్యక్తి బస్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి అతడు ఇండోర్ నుంచి రాజస్థాన్‌కు బస్ నడుపుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సతీష్ అనారోగ్యానికి గురయ్యాడు. బస్ నడపలేని స్థితికి వచ్చాడు. మరో డ్రైవర్‌కు విషయం చెప్పి, డ్రైవింగ్ బాధ్యతల్ని అతడికి అప్పగించాడు. డ్రైవర్ సీటు పక్కన కూర్చుని నిద్రపోతూ ఉన్నాడు. సరిగ్గా గంట తర్వాత అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఛాతిలో నొప్పితో గిలగిల్లాడసాగాడు. ఇది గుర్తించిన బస్సులోని వారు అతడికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు.
సీపీఆర్ చేశారు. అయినా అతడి పరిస్థితి మెరుగుపడలేదు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. సతీష్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు. సైలెంట్ హార్ట్ ఎటాక్ కారణంగా అతడు చనిపోయినట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. సతీష్ మరణ వార్త తెలుసుకున్న కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. సతీష్ మరణంపై ఎలాంటి దర్యాప్తు అవసరం లేదని, పోస్టుమార్టం కూడా వద్దని కుటుంబసభ్యులు స్పష్టం చేశారు. సతీష్ మృతదేహాన్ని నేరుగా అతడి స్వగ్రామానికి తరలించారు.
ఇవి కూడా చదవండి