Share News

Funny Video: ఏంది బ్రో.. అమ్మాయి కోసం ఇంతపని చేసేశావ్..

ABN , Publish Date - Dec 21 , 2025 | 10:22 PM

టీవీలో సినిమాలు, సీరియళ్లు చూస్తున్నట్లు మధ్య మధ్యలో అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తుంటాయి. డిటర్జెంట్స్, టూత్ పేస్ట్, కాస్ట్యూమ్స్, ఫర్‌ఫ్యూమ్స్‌కు సంబంధించిన యాడ్స్ విపరీతంగా ఉంటాయి. వీటిలో కొన్ని యాడ్స్ బాగా అట్రాక్ట్ చేస్తుంటాయి. కొన్ని ఫర్‌ఫ్యూమ్స్‌కి సంబంధించి యాడ్స్‌లో

Funny Video: ఏంది బ్రో.. అమ్మాయి కోసం ఇంతపని చేసేశావ్..
Viral Video

ఇంటర్నెట్‌డెస్క్, డిసెంబర్ 21: టీవీలో సినిమాలు, సీరియళ్లు చూస్తున్నట్లు మధ్య మధ్యలో అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తుంటాయి. డిటర్జెంట్స్, టూత్ పేస్ట్, కాస్ట్యూమ్స్, ఫర్‌ఫ్యూమ్స్‌కు సంబంధించిన యాడ్స్ విపరీతంగా ఉంటాయి. వీటిలో కొన్ని యాడ్స్ బాగా అట్రాక్ట్ చేస్తుంటాయి. కొన్ని ఫర్‌ఫ్యూమ్స్‌కి సంబంధించి యాడ్స్‌లో ఒక వ్యక్తి స్ప్రే తన శరీరానికి కొట్టుకోగా.. ఆ సువాసనకు ముగ్దులై అమ్మాయిలు వెంట పడుతుంటారు. ఇలాంటి యాడ్‌ని బేస్‌ చేసుకుని ఓ వ్యక్తి మెట్రో ట్రైన్‌లో ప్రాంక్ చేశాడు. అది చూసి మరో వ్యక్తి పెద్ద బకరా అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సీన్ చూస్తే పడి పడి నవ్వా్ల్సిందే. ఆ రేంజ్‌లో ఉంది కాబట్టే విపరీతంగా వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ వీడియోలో ఏముందో తెలుసుకుందాం..


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. మెట్రో ట్రైన్‌లో ఇద్దరు యువతులు పక్క పక్కనే కూర్చొన్నారు. ఇంతలో ఓ యువకుడు వారి వద్దకు వచ్చాడు. తన జేబులోంచి ఓ స్ప్రే బాటిల్(ఫర్‌ఫ్యూమ్) తీసుకుని.. తన శరీరానికి కొట్టుకున్నట్లుగా నటిస్తాడు. అనంతరం ఆ బాటిల్‌ను కింద పడేస్తాడు. అయితే, ఆ సెంట్ వాసనకు సీట్‌లో కూర్చు్న్న యువతి.. సడెన్‌గా లేచి సెంట్ కొట్టుకున్న యువకుడితో వెళ్లిపోతుంది. ఇదంతా పక్కనే ఉండి గమనించిన మరో యువకుడు.. తాను కూడా ఫర్‌ఫ్యూమ్ కొట్టుకుంటే సీటులో కూర్చున్న మరో యువతి తనతో వస్తుందని భావించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. కింద పడేసిన స్ప్రే బాటిల్‌ను అందుకున్నాడు. నేరుగా తన మెడ భాగంలో, ఛాతి భాగంలో స్ప్రే చేసుకున్నాడు. అయితే, అది ప్రెస్ చేయగానే ఫర్‌ఫ్యూమ్‌‌కి బదులుగా.. స్నో ఫాగ్ బయటకు వచ్చింది. దీంతో అది చూసిన యువతి.. గొల్లున నవ్వేసింది. చుట్టూ ఉన్నవారు సైతం పగలబడి నవ్వేశారు. చూడటానికి చాలా ఫన్నీగా ఉన్న వీడియోను మీరూ మిస్ అవ్వకండి. మరెందుకు ఆలస్యం.. వీడియోను చూసేయండి.

Updated Date - Dec 21 , 2025 | 10:22 PM