Share News

ChatGPT Legal Advice: లాయర్‌గా మారిన చాట్‌జీపీటీ.. ప్రయాణికుడికి దక్కిన న్యాయం

ABN , Publish Date - May 22 , 2025 | 01:07 PM

మానసిక అనారోగ్యం కారణంగా చివరి నిమిషంలో టూర్ వాయిదా వేసుకున్న ఓ వ్యక్తి చాట్‌జీపీటీ సాయంతో ఆయా సంస్థల నుంచి రిఫండ్ రాబట్టాడు. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది.

ChatGPT Legal Advice: లాయర్‌గా మారిన చాట్‌జీపీటీ.. ప్రయాణికుడికి దక్కిన న్యాయం
ChatGPT legal assistance

ఇంటర్నెట్ డెస్క్: అతడు అమెరికాలో ఉంటాడు. కొలంబియా వెళ్లాలనుకున్నాడు. విమానం టిక్కెట్లు, హోటల్ గదులు కూడా బుక్ చేసుకున్నాడు. కానీ చివరి నిమిషంలో అనారోగ్యం తిరగబెట్టడంతో టూర్‌కు వెళ్లలేకపోయాడు. టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ మేరకు రిఫండ్ ఇవ్వాలని హోటల్లకు, ఎయిర్‌లైన్స్ సంస్థలకు లేఖ రాశాడు.

తొలిసారి లేఖలు రాసినప్పుడు అతడికి చుక్కెదురైంది. హోటళ్లతో పాటు ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా రిఫండ్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఎట్టిపరిస్థితుల్లో రిఫండ్ ఇవ్వమని స్పష్టం చేశాయి. క్యాన్సిలేషన్ విషయాల్లో తమ నిబంధనలు కచ్చితంగా ఉంటాయని, ఈ విషయంలో తాము చేయగలిగింది ఏమీ లేదని పేర్కొన్నాయి.

దీంతో, సదరు ప్రయాణికుడు ఒకింత షాక్‌కు గురయ్యాడు. ఏం చేయాలో పాలు పోలేదు. లీగల్‌గా ముందుకెళదామంటే డబ్బులు ఖర్చవుతాయి. చివరకు బాగా ఆలోచించి అతడు చాట్‌జీపీటీ సాయం తీసుకున్నాడు. తన సమస్యను వివరించాడు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందన్నాడు.


ఈ అంశంపై చాట్‌జీపీటీ కూడా నెట్టింట సర్చ్ చేసింది. లాయర్ అవతారం ఎత్తి ఎయిర్‌లైన్స్, హోటళ్ల రిఫండ్ పాలసీని క్షుణ్ణంగా స్టడీ చేసింది. చివరకు లీగల్ భాషల్లో హాటళ్లకు, ఎయిర్‌లైన్స్‌ కోసం లేఖలు తయారు చేసిచ్చింది. లేఖలో పదునైన భాష వాడింది. మెడికల్ ఎమర్జెన్సీ సందర్భాల్లో రిఫండ్ ఇవ్వాల్సిందేనని వాదిస్తూ లేఖ రూపొందించింది. ఈ లెటర్స్ దెబ్బకు హోటళ్లు అన్నీ దిగొచ్చాయి. బుకింగ్ తాలుకు డబ్బులను రిఫండ్ చేశాయి.

కానీ ఎయిర్‌లైన్స్ సంస్థ మాత్రం బెట్టు సడలించలేదు. డబ్బు వెనక్కు ఇచ్చేదే లేదంటూ ప్రత్యుత్తరమిచ్చింది. సదరు ప్రయాణికుడు ఈ లేఖను చాట్‌జీపీటీ ముందుంచాడు. అనంతరం, ఈ చాట్‌బాట్ మరో లేఖను డిజైన్ చేసింది. మానసిక రోగాలకు సంబంధించి రిఫండ్ ఇవ్వననడం వివక్షేనని స్పష్టం చేస్తూ లేఖ రాసింది.


విషయం మరింత ముదిరితే కొత్త కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన ఎయిర్ లైన్స్ .. చివరకు బెట్ట సడలించి టిక్కెట్ డబ్బులు తిరిగిచ్చేసింది. ఇక చాట్‌జీపీటీ విజయం చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. భవిష్యత్తు ఏఐదే అంటూ డంకా బజాయిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

పనిమనిషి బండారం బయటపెట్టిన ఫేస్‌బుక్ ఫొటో

రూ.15 వేల జరిమానా చెల్లించిన ఫ్లాట్ ఓనర్.. ఎందుకో తెలిస్తే..

25 ఏళ్ల సీనియారిటీ ఉన్న ఉద్యోగి తొలగింపు.. మైక్రోసాఫ్ట్‌పై బాధితుడి భార్య ఫైర్

Read Latest and Viral News

Updated Date - May 22 , 2025 | 01:15 PM