Share News

Biker Viral Video: సాటి బైకర్‌కే ఇతడి బాధ అర్థమవుతుంది.. ఎలాంటి సమస్య వచ్చిందో మీరే చూడండి..

ABN , Publish Date - Apr 24 , 2025 | 05:33 PM

ఓ వ్యక్తి కొత్తగా కొన్న బైక్ వేసుకుని రైడ్‌కు వెళ్లాడు. రయ్యిన దూసుకెళ్తుండగా.. దారి మధ్యలో ఊహించని సమస్య వచ్చి పడింది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ సాటి బైకర్‌కే ఇతడి బాధ అర్థమవుతుంది’’... అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Biker Viral Video:  సాటి బైకర్‌కే ఇతడి బాధ అర్థమవుతుంది.. ఎలాంటి సమస్య వచ్చిందో మీరే చూడండి..

బైక్ డ్రైవింగ్‌కు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. బైకుపై విచిత్ర విన్యాసాలు చేయడం, వాహనాలను విచిత్రమైన రీతిలో తయార చేయడం వంటి ప్రయోగాల వీడియోలను చూశాం. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓ బైకర్‌కు వింత సమస్య వచ్చి పడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ సాటి బైకర్‌కే ఇతడి బాధ అర్థమవుతుంది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కొత్తగా కొన్న బైక్ (New Bike) వేసుకుని రైడ్‌కు వెళ్లాడు. రయ్యిన దూసుకెళ్తుండగా.. దారి మధ్యలో ఊహించని సమస్య వచ్చి పడింది. రోడ్డు మొత్తం బురదమయంగా ఉండడం (New Bike on Muddy Road) చూసి సడన్‌గా ఆగిపోయాడు. చిన్న మరక కూడా లేని తన బైకును.. ఆ బురదలో నడపడం తనకు ఇష్టం లేక అలాగే ఉండిపోయాడు.

Jugaad Viral Video: ఈ అల్మారాలోని నగదు కొట్టేయడం అసాధ్యం.. దొంగలకు ఎలా షాకిచ్చాడో చూడండి..


రోడ్డు మీద ఉన్న బురద ఓ వైపు, తళతళా మెరిసిపోతున్న బైకు మరోవైపు.. ఇలా ఆ వ్యక్తికి వింత సమస్య వచ్చి పడింది. ‘‘నా కొత్త బైకును చూస్తూ చూస్తూ ఈ బురదలో ఎలా తీసుకెళ్లాలి’’.. అన్నట్లుగా ఏడుస్తూ వీడియో తీశాడు. తనకు ఎదురైన వింత సమస్యను వీడియో తీసి, నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. రియల్ పెయిన్.. అని ప్రస్తావిస్తూ ఆ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Cake cutting in Pakistan: ప్రాణాలు తీసి పైశాసిక ఆనందం.. పాక్ హైకమిషన్ వద్ద కేక్ కటింగ్.. వీడియో వైరల్..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చూస్తుంటే ఎంతో బాధగా అనిపిస్తోంది సోదరా’’.., ‘‘వద్దు బ్రదర్..వెంటనే వెనక్కు వచ్చేయండి’’.., ‘‘ఇది చాలా క్లిష్టమైన సమస్య’’.., ‘‘పగవాడికి కూడా ఇలాంటి కష్టం రావొద్దు’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌‌‌లు, 2.4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Jugaad Viral Video: వామ్మో.. ఫ్రిడ్జ్‌ను ఇలా సెట్ చేశాడేంటీ.. డోరు తీయగానే షాకింగ్ సీన్..


ఇవి కూడా చదవండి..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 24 , 2025 | 05:33 PM