Share News

Python attack: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. పిల్లిని మింగుతున్న కొండచిలువ.. తర్వాతేం జరిగిందంటే..

ABN , Publish Date - Nov 14 , 2025 | 09:18 AM

కొండచిలువను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. కొండచిలువకు చిక్కిన ఏం జంతువైనా ప్రాణాలతో బయటపడడం అసాధ్యం. ప్రస్తుతం ఓ థ్రిల్లింగ్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. సింగపూర్ వైల్డ్‌లైఫ్ సైటింగ్స్ ఫేస్‌బుక్ పేజీలో ఆ వీడియో షేర్ అయింది.

Python attack: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. పిల్లిని మింగుతున్న కొండచిలువ.. తర్వాతేం జరిగిందంటే..
Singapore python attack

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయంటే అటువైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే చాలా మంది పాములకు దూరంగా ఉంటారు. ఇక, కొండచిలువను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. కొండచిలువకు చిక్కిన ఏం జంతువైనా ప్రాణాలతో బయటపడడం అసాధ్యం. ప్రస్తుతం ఓ థ్రిల్లింగ్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (python vs cat).


సింగపూర్ వైల్డ్‌లైఫ్ సైటింగ్స్ ఫేస్‌బుక్ పేజీలో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను సింగపూర్‌లో మార్కస్ లీ అనే వ్యక్తి చిత్రీకరించారు (Singapore python attack). మార్కస్‌కు తన ఇంటి సమీపంలోని చెట్ల పొదల నుంచి గుర్రుమనే శబ్దం వినిపించింది. ఓ పిల్లిని కొండచిలువ చుట్టేసి దానిని చంపేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో మార్కస్ ఆ కొండచిలువ తోక పట్టుకుని పైకి లేపాడు. కొండచిలువ బారి నుంచి ధైర్యంగా పిల్లిని కాపాడేందుకు ప్రయత్నించాడు. కొండచిలువను కాలితో తొక్కి పట్టి పిల్లిని వేరు చేసేందుకు ప్రయత్నించాడు.


మార్కస్ ఎన్నో సార్లు ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ పిల్లిని కొండచిలువ వదిలేసింది (viral rescue video). ఆ తర్వాత కొండచిలువ సమీపంలోని చెట్లలోకి వెళ్లిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను మార్కస్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. 'కొండచిలువకు క్షమాపణలు' అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సహజంగా జరగాల్సిన వేట ప్రక్రియలో మార్కస్ జోక్యం చేసుకున్నాడని కొందరు విమర్శించారు. మరికొందరు మాత్రం అతడి ధైర్య సాహసాలను ప్రశంసించారు.


ఇవి కూడా చదవండి..

వాషింగ్ మెషిన్‌ను ఇలా కూడా వాడతారా.. ఈమె ఏం చేసిందంటే..


మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 14 , 2025 | 09:20 AM