Man runs on water: షాకింగ్ టెక్నాలజీ.. సముద్రం మీద ఎలా పరిగెడుతున్నాడో చూడండి..
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:46 PM
రోజురోజుకూ సరికొత్త టెక్నాలజీ మనల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఎప్పటికప్పుడు మారే సాంకేతికత సరికొత్త అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. మానవుడు నీటిపై నడవగలడా? ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.
రోజురోజుకూ సరికొత్త టెక్నాలజీ మనల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఎప్పటికప్పుడు మారే సాంకేతికత సరికొత్త అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. మానవుడు నీటిపై నడవగలడా? ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మానవుడు నీటిపై నడవడం ఇక ఎంత మాత్రం కల కాదు. నీటిపై నడవడం మాత్రమే కాదు.. పరుగు కూడా పెట్టవచ్చు. అలాంటి బూట్లు అందుబాటులోకి వచ్చాయి (tech shoes video).
ఆ సరికొత్త షూస్‌కు సంబంధించిన వీడియోను alilo_golf అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించి తయారైన బూట్లు ధరించి ఉన్నాడు. ఆ బూట్లను ధరించిన వ్యక్తి స్విమ్మింగ్ ఫూల్‌లోని నీటిపై అడుగు పెట్టాడు. ఆశ్చర్యకరంగా అతడు మునిగిపోలేదు. ఆ బూట్ల సహాయంతో నీటిపై తేలి ఉన్నాడు. ఆ తర్వాత నీటి ఉపరితలంపై నడిచాడు (water running video).
అదే బూట్లను ధరించి ఏకంగా సముద్రంపై పరుగులు పెట్టాడు ( man walking on sea). సముద్రం మధ్యలో అతడు పరిగెడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 25 లక్షల మంది వీక్షించారు. 2.45 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తే ఇక నదులకు, సముద్రాలకు ఎవరూ భయపడరని చాలా మంది కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఏనుగు vs ఖడ్గమృగం.. ఈ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
మీకు కశ్మీర్ ఇస్తే ఏం చేసుకుంటారు.. పాకిస్థాన్ టోల్ ప్లాజాపై నెటిజన్ల సెటైర్లు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..