Funny interview: అందుకే ఇంటర్ పాస్ కాలేదు.. ఇంటర్వ్యూలో ఈ కుర్రాడి సమాధానం వింటే నవ్వుకోవాల్సిందే..
ABN , Publish Date - Dec 22 , 2025 | 06:00 PM
సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినోదాత్మక, ఆకర్షణీయ, వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (funny interview viral video).
omedyculture.in అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కుర్రాడు ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అతడి మార్కులు చూసిన సంస్థ ప్రతినిధులు ఇంటర్మీడియట్ గురించి ప్రశ్నించారు. మీరు ఎందుకు ఇంటర్ పాస్ కాలేకపోయారని అభ్యర్థిని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించారు. దానికి ఆ కుర్రాడు స్పందిస్తూ.. 'మా సర్ వేరే మేడమ్‌తో పారిపోయారు.. దాంతో కాలేజీ మూసేశారు' అని చెప్పాడు (hilarious education story).
ఆ కుర్రాడి సమాధానం విని అక్కడున్న అందరూ నవ్వుకున్నారు (unexpected interview answer). ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దాదాపు 8 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 55 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేసి తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ఈ కుర్రాడికి గొప్ప భవిష్యత్తు ఉంటుందని ఒకరు సరదాగా కామెంట్ చేశారు. నన్ను అడిగినపుడు నేను కూడా ఈ సాకు చెబితే బాగుండేదని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
అందరికీ ఇలాంటి బాస్ ఉండాలి.. ఉద్యోగులకు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్‌ల గురించి తెలిస్తే..
కూతురిని ఇంట్లో ఉంచి బయటకెళ్లిన తండ్రి.. తిరిగి వచ్చేసరికి ఏం జరిగిందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..