Tractor Viral Video: ట్రాక్టర్ కంపెనీలకే షాకిచ్చాడుగా.. ఇతడి వాహనాన్ని చూస్తే ఖంగుతినాల్సిందే..
ABN , Publish Date - Jul 25 , 2025 | 01:53 PM
ఓ వ్యక్తి తన ట్రాక్టర్‌ను విచిత్రంగా మార్చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం చివరకు దాని ముందు చక్రాలను తొలగించాడు. ఆ తర్వా వాటి స్థానంలో పెద్ద ఇనుప డ్రమ్మును ఏర్పాటు చేశాడు..
చాలా మంది తమ వాహనాలను చిత్రవిచిత్రంగా మార్చడం చూస్తుంటాం. కొందరు బైకులకు బస్సు గేర్లు అమర్చితే.. మరికొందరు వారి ఆటోలను కారు తరహాలో మారుస్తుంటారు. అలాగే ఇంకొందరు ఏకంగా వాహనాల రూపురేఖలనే మార్చేసి అంతా షాక్ అయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన ట్రాక్టర్ ముందు చక్కాలను తొలగించి విచిత్ర ప్రయోగం చేశాడు. ఈ ట్రాక్టర్‌ను చూసిన వారంతా.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ట్రాక్టర్‌ను విచిత్రంగా మార్చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం చివరకు దాని ముందు చక్రాలను తొలగించాడు. ఆ తర్వా వాటి స్థానంలో పెద్ద ఇనుప డ్రమ్మును ఏర్పాటు చేశాడు. ఆ డ్రమ్ము అటూ, ఇటూ కదిలేలా సెట్ చేశాడు.
ఫైనల్‌గా దీన్ని చూస్తే రోడ్ రోలర్ అనిపించేలా (Tractor converted into Road Roller) మార్పులు చేశాడు. ఫైనల్‌గా ట్రాక్టర్‌ను మట్టి రోడ్డు పైకి తీసుకెళ్లి ప్రయోగించాడు. రోడ్డుపై ఉన్న మట్టిని రోడ్డు రోలర్ తరహాలో చదును చేయడం చూసి అంతా వింతగా చూస్తున్నారు. ఇలా ఆ వ్యక్తి ట్రాక్టర్‌ను కాస్తా.. రోడ్ రోలర్‌గా మార్చేశాడన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 100కి పైగా లైక్‌లు, 14 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..
ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి