Man Climbs Hotel Window: హోటల్ గదిలో ప్రియురాలితో భర్త.. భార్య సడెన్ ఎంట్రీ ఇవ్వటంతో..
ABN , Publish Date - Dec 21 , 2025 | 07:50 AM
హోటల్ గదిలో ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న భర్తకు భార్య ఊహించని షాక్ ఇచ్చింది. హోటల్ గది దగ్గరకు మనుషుల్ని తీసుకుని వచ్చింది. దీంతో భర్త భయపడిపోయాడు. అక్కడినుంచి పారిపోవటానికి ఐదో అంతస్తులో ఉన్న కిటికీ నుంచి కిందకు దిగాడు. హోటల్ సైన్ బోర్డు పట్టుకుని వేలాడసాగాడు.
హోటల్ గదిలో ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న భర్తకు ఊహించని షాక్ తగిలింది. భార్య సడెన్ ఎంట్రీ ఇవ్వటంతో ఖంగు తిన్న అతడు ప్రాణాల మీదకు వచ్చే పని చేశాడు. భార్యకు పట్టుబడకుండా ఉండటానికి ప్రమాదకరమైన స్టంట్ చేశాడు. ఐదో అంతస్తుపై ఉన్న హోటల్ సైన్ బోర్డు పట్టుకుని వేలాడాడు. కొంచెం ఉంటే అతడి ప్రాణాలు పోయేవి. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు. ఎంత కష్టపడ్డా కూడా భార్యకు మాత్రం అడ్డంగా దొరికి పోయాడు. ఈ సంఘటన చైనాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. హాంగ్‌చౌవ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి చాలా ఏళ్ల క్రితమే పెళ్లి అయింది.
ఆ వ్యక్తి భార్యని కాదని వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. భార్యకు తెలియకుండా కొన్ని నెలల పాటు బాగానే సంబంధాన్ని కొనసాగించాడు. అయితే, భార్యకు అతడిపై అనుమానం వచ్చింది. అతడిపై నిఘా పెట్టింది. ఓ రోజు ఆ వ్యక్తి తన ప్రియురాలితో కలిసి బోయు హోటల్‌కు వెళ్లాడు. హోటల్ గదిలో ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో అనుకోని షాక్ తగిలింది. అతడి భార్య కొంతమంది వ్యక్తులతో కలిసి హోటల్ గది దగ్గరకు వచ్చింది. బయటినుంచి తలుపుకొట్టసాగింది. ఆమె అరుపులు విన్న భర్త భయపడిపోయాడు. అక్కడినుంచి పారిపోవటానికి ఐదో అంతస్తులో ఉన్న కిటికీ నుంచి కిందకు దిగాడు. హోటల్ సైన్ బోర్డు పట్టుకుని వేలాడసాగాడు.
అతడి ప్రియురాలు వెళ్లి తలుపులు తీసింది. అందరూ లోపలికి వచ్చేశారు. ఆ వ్యక్తి కోసం వెతకసాగారు. ప్రాణాలకు తెగించి మరీ కష్టపడ్డా కూడా అతడు భార్యకు దొరికిపోయాడు. కిటికీలోనుంచి భార్య కిందకు చూసింది. అతడు వేలాడుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘భార్యను మోసం చేయాలనుకున్న వారు ధైర్యంగా మోసం చేయాలి.. ఇలా భయపడి దాక్కోవటం ఏంటి?’.. ‘నువ్వెలా ఆ ప్రదేశంలోకి వచ్చావు? చాలా గ్రేట్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
లోక్‌భవన్‌కు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్
ఆధ్యాత్మికతే మానవాళికి దిక్సూచి