Hyderabad Visit: లోక్‌భవన్‌కు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్
ABN , Publish Date - Dec 21 , 2025 | 07:32 AM
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం ఘన స్వాగతం పలికారు.
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం ఘన స్వాగతం పలికారు. రాధాకృష్ణన్ శనివారం రాత్రి లోక్‌భవన్‌లోనే బస చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లోనే ఉండగా... తాజాగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ హైదరాబాద్‌విచ్చేశారు. ఇటు ఆదివారం రంగారెడ్డి జిల్లా నందిగామలోని కన్హాశాంతివనాన్ని గవర్నర్‌తో కలిసి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సందర్శించనున్నారు. కన్హాశాంతివనంలోని హార్ట్‌పుల్‌నెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ ధ్యాన దినోత్సవంలో వారు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హార్ట్‌పుల్‌నెస్ గ్లోబల్ అధ్యక్షుడు కమలేశ్ డి పటేల్‌తో సమావేశమై చర్చిస్తారని వెల్లడించారు.