Lions vs crocodile: మొసలిని రౌండప్ చేసిన సింహాలు.. థ్రిల్లింగ్ ఫైట్‌లో చివరకు ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:29 PM
ప్రస్తుతం అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా అడవిలో ఓ థ్రిల్లింగ్ ఫైట్‌కు సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా అడవిలో ఓ థ్రిల్లింగ్ ఫైట్‌కు సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (jungle battle viral video).
nature.decoded అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒంటరి మొసలిపై సింహాలు దాడి చేస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. సాధారణంగా నీటిలో ఉన్నప్పుడు మొసలి అత్యంత బలమైనది. నీటిలోని మొసలికి చిక్కితే ఏనుగు కూడా ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. భూమి మీదకు వస్తే మాత్రం మొసలి బలహీనంగా మారిపోతుంది. అయితే ఈ వీడియోలో ఓ మొసలి సింహాల గుంపునకు చిక్కి ధైర్యంగా పోరాడింది (wildlife attack video).
మొసలిని రౌండప్ చేసిన సింహాలు దానిని చంపేందుకు ప్రయత్నించాయి (lions crocodile encounter). అయితే మొసలి ఆ సింహాలతో తన శాయశక్తులా పోరాటం చేసింది. చివరకు ఒక సింహం ఆ మొసలి గొంతు పట్టుకుని కొరికి చంపేసింది. ఈ థ్రిల్లింగ్ ఫైట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు కోట్ల మంది వీక్షించారు. 15 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు.
ఇవీ చదవండి:
ఇంటి నిర్వహణ కోసం ప్రత్యేక మేనేజర్.. నెలకు జీతం ఎంతో తెలిస్తే..
దొంగ మనసు మార్చిన చిన్నారి.. చూసి తీరాల్సిన వీడియో!