Rare Gir Forest Footage: సింహం, సివంగి భీకర పోరు.. గెలుపు దేనిదంటే..
ABN , Publish Date - Oct 05 , 2025 | 07:44 PM
సివంగి చెట్టు చాటున దాక్కుంది. సింహం అక్కడినుంచి వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత వేగంగా సివంగి దగ్గరకు దూసుకువచ్చింది. దాడి చేయడానికి ప్రయత్నించింది.
అడవికి సింహం రాజు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అడవిలో నివసించే పెద్దపెద్ద జంతువులు కూడా సింహాన్ని చూస్తే గజగజ లాడిపోతాయి. ప్రాణ భయంతో పరుగులు తీస్తాయి. సింహం గర్జన విన్నా చాలు అడవిలోని జంతువుల గుండెలు ఆగినంత పని అవుతుంది. అయితే, అడవికి రాజైనా సరే సివంగితో జాగ్రత్తగా ఉండాల్సిందే. అనవసరంగా సింవంగితో పెట్టుకుంటే మూతి పగిలిపోతుంది.
ఇందుకు తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. కొన్నిరోజుల క్రితం గుజరాత్‌లోని గిర్ ఫారెస్ట్‌లో ఓ సింహం అనవసరంగా సివంగితో గొడవ పెట్టుకుంది. మొదట్లో సివంగి భయపడింది. సింహం మీదకు వస్తుంటే వెనక్కు తగ్గింది. భయంతో నేలపై కూర్చుంది. కూర్చున్నంత సేపు సింహం ఏమీ అనలేదు. సివంగి కొంత సమయం తర్వాత అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. అంతే సింహం మళ్లీ మీదకు వచ్చింది.
ఈసారి సివంగి చెట్టు చాటున దాక్కుంది. సింహం అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత వేగంగా సివంగి దగ్గరకు దూసుకువచ్చింది. దాడి చేయడానికి ప్రయత్నించింది. దీంతో సివంగి తన పంజాతో సింహం ముఖంపై దాడి చేసింది. సింహం మాత్రం సివంగిని బాగా కొరికింది. మొత్తానికి సింహమే విజయం సాధించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
మనిషి రూపంలో ఉన్న మృగం.. కుక్కపిల్లల్ని అతి క్రూరంగా..
అందాల పోటీ కోసం రిహార్సల్స్.. సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆర్‌హెచ్ఎస్ఎస్