Leopard Attack Video: చిరుతను రెచ్చగొడితే ఇలాగే ఉంటుంది.. ఓ చిన్న కుర్రాడి పరిస్థితి ఏమైందంటే..
ABN , Publish Date - Aug 19 , 2025 | 08:45 PM
ఇటీవలి కాలంలో చాలా మంది సఫారీ టూర్‌లకు వెళ్తున్నారు. అడవుల్లో తిరుగుతూ వన్య ప్రాణులను చూసేందుకు ఇష్టపడుతున్నారు. అక్కడ తీసుకున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే వన్య ప్రాణులతో వెకిలిగా ప్రవర్తించి, వాటిని రెచ్చగొట్టి ప్రమాదాలకు గురవుతున్నారు.
ఇటీవలి కాలంలో చాలా మంది సఫారీ టూర్‌ల (Safari Tours)కు వెళ్తున్నారు. అడవుల్లో తిరుగుతూ వన్య ప్రాణులను (Wild Animals) చూసేందుకు ఇష్టపడుతున్నారు. అక్కడ తీసుకున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కొందరు వన్య ప్రాణులతో వెకిలిగా ప్రవర్తించి, వాటిని రెచ్చగొట్టి ప్రమాదాలకు గురవుతున్నారు. ఆ వన్య ప్రాణాలకు అసౌకర్యం కలిగిస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జంగిల్ సఫారీ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
@IndianBackchod అనే ఎక్స్ యూజర్ ఈ వీడియో (Viral Video)ను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోను కర్ణాటకలోని బన్నీర్‌ఘట్ట నేషనల్ పార్క్‌లో చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రెండు జీప్‌లలో టూరిస్ట్‌లు సఫారీ టూర్‌కు వెళ్లారు. ఆ సమయంలో వారికి రోడ్డు పక్కన ఓ చిరుత (Leopard) కనిపించింది. దీంతో జీపును ఆపి అరుపులు, కేకలు వేశారు. దీంతో ఆ చిరుత ఆగ్రహానికి గురైంది. ఓ జీప్ దగ్గరకు వెళ్లి దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆ జీప్ డోర్ దగ్గర కూర్చున్న 13 ఏళ్ల కుర్రాడి చేతిపై గాయాలు చేసింది (Leopard attacked child).
వెంటనే ఆ జీప్‌ను డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. కొద్ది దూరం ఆ జీప్‌ను చిరుత వెంబడించి తర్వాత ఆగిపోయింది. వెనుక జీప్‌లో ఉన్న వ్యక్తులు ఆ ఘటనను వీడియో తీశారు. కుర్రాడిని హాస్పిటల్‌కు తరలించారు. అతడికి చికిత్స అందించిన వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వందల మంది ఆ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. మరణం అంచుల వరకు వెళ్లొచ్చాడు.. మొసలి ఏం చేసిందో చూడండి..
వావ్.. ఏం తెలివి.. ఉల్లిపాయలను కట్ చేయడానికి ఈమె ట్రిక్ చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..