Share News

ఈ బ్యాంకులో పనిచేసేది మొత్తం పిల్లలే.. ఎందుకంటే..

ABN , Publish Date - Aug 17 , 2025 | 01:14 PM

గుజరాత్‌లోని ఖేడా జిల్లాకు చెందిన కాజీపురా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, బడి పిల్లలకు పాఠాలతో పాటు డబ్బు పొదుపు చేయడం కూడా నేర్పిస్తున్నారు. ఇందుకోసం స్కూల్‌లోని ఒక ఖాళీ గదిని బ్యాంకుగా మార్చి, దానికి ‘బ్యాంక్‌ ఆఫ్‌ కాజీపురా’ అని పేరు పెట్టారు.

ఈ బ్యాంకులో పనిచేసేది మొత్తం పిల్లలే.. ఎందుకంటే..

- బడిలో బ్యాంకు

అదో బ్యాంకు! అందులో విద్యార్థులే ఉద్యోగులు. వారే ఎంచక్కా బ్యాంకు కార్యకలాపాలన్నీ నిర్వహిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లల కోసం పిల్లలే తమ పాఠశాలలో నడుపుతున్న బ్యాంకు అది.

గుజరాత్‌లోని ఖేడా జిల్లాకు చెందిన కాజీపురా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, బడి పిల్లలకు పాఠాలతో పాటు డబ్బు పొదుపు చేయడం కూడా నేర్పిస్తున్నారు. ఇందుకోసం స్కూల్‌లోని ఒక ఖాళీ గదిని బ్యాంకుగా మార్చి, దానికి ‘బ్యాంక్‌ ఆఫ్‌ కాజీపురా’ అని పేరు పెట్టారు. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు నిర్దేశించిన సమయంలో ప్రతీరోజూ డబ్బులు తీసుకోవడం, జమ చేయడం, రశీదులివ్వడం చేస్తుంటారు. మేనేజర్‌, క్యాషియర్‌గా కూడా వారే వ్యవహరిస్తారు.


గతంలో పాకెట్‌మనీతో బడి బయట ఉన్న దుకాణాల్లో విపరీతంగా చిరుతిళ్లు కొనుక్కునేవారు విద్యార్థులు. బడిలో బ్యాంకు ఏర్పాటు చేసిన తర్వాత జంక్‌ ఫుడ్‌ తినడం బాగా తగ్గించేశారట. పిల్లలు పోటీపడి మరీ ఇంట్లో ఇచ్చిన పాకెట్‌మనీలో కొంత మొత్తాన్ని ఈ బ్యాంకులో దాచుకుంటున్నారు. తమ ఖాతాల్లోని డబ్బులను వారు ఎప్పుడంటే అప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు. కాకపోతే, ఎందుకోసం తీసుకుంటున్నారో తెలుపుతూ, ఒక చలాన్‌ నింపి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బ్యాంకులో మొత్తం 242 ఖాతాలున్నాయి. ఆయా పొదుపు ఖాతాలపై వార్షికంగా 8 శాతం దాకా వడ్డీ అందించడం విశేషం.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 17 , 2025 | 01:14 PM