Viral Video: మహిళను పొగిడిన షాపు సిబ్బంది.. ఆమె భర్త చేసిన పనికి అందరూ షాక్..
ABN , Publish Date - Jul 11 , 2025 | 08:10 AM
Viral Video: షాపులోని వాళ్లు ఎంత ఆపినా అతడు ఆగలేదు. మాటలతో రెచ్చిపోయాడు. అక్కడ ఉన్న ఓ వ్యక్తి దీన్నంతా తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దేవుడి సృష్టిలో అత్యంత వింతైన జీవి ఏదైనా ఉంది అంటే.. అది కచ్చితంగా మనిషే. మనిషి ఎప్పుడు.. ఎలా ప్రవర్తిస్తాడో ఎవ్వరమూ చెప్పలేము. మానసిక స్థితులు, పరిస్థితులు, అవసరాలను బట్టి ఇష్టం వచ్చినట్లు మారిపోతూ ఉంటాడు. మనిషి ప్రవర్తన చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ‘జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి’ అన్నట్లు .. మనిషికి మనిషికి మధ్య ప్రవర్తనలో తేడాలు ఉంటాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. తన భార్యను షాపు సిబ్బంది అందంగా ఉందని పొగిడినందుకు.. ఓ భర్త తట్టుకోలేకపోయాడు. షాపు సిబ్బందితో గొడవకు దిగాడు. కొన్ని నిమిషాల పాటు షాపులో రచ్చరచ్చ చేశాడు.
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కాన్సాస్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఓ పాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లాడు. భార్యాభర్తలు షాపులోకి వెళ్లగానే.. ఇండియాకు చెందిన షాపు సిబ్బంది ఒకరు ఆమెను విష్ చేశాడు. విష్ చేయటంలో భాగంగా.. ‘మీరు అందంగా ఉన్నారు’ అని కూడా అన్నాడు. అంతే.. భర్తకు కోపం వచ్చింది. షాపు సిబ్బందితో గొడవకు దిగాడు. ‘నా భార్యతో అలా ఎందుకు చెప్పావు’అంటూ రచ్చ రచ్చ చేశాడు. ఆ సిబ్బంది క్షమాపణ చెప్పినా వినలేదు.
‘నా భార్య అందంగా ఉందని ఎందుకు అన్నావు. ఇదేమన్నా ఇండియా అనుకుంటున్నావా’ అంటూ ఫైర్ అయ్యాడు. షాపులోని వాళ్లు ఎంత ఆపినా అతడు ఆగలేదు. మాటలతో రెచ్చిపోయాడు. అక్కడ ఉన్న ఓ వ్యక్తి దీన్నంతా తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ భర్త తాగినట్లు ఉన్నాడు. లేదా.. సూపర్ ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతున్నాడు. భార్యను ఎవరైనా పొగిడితే తట్టుకోలేకపోతున్నాడు’..‘బయటి దేశంలో ఓ భారతీయుడిని మరో భారతీయుడు ఇంతలా అవమానించటం ఏమీ బాలేదు. ఆ భర్త ఇండియా పరువు తీస్తున్నాడు’ అంటూ మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
వావ్.. ఈ బుల్లి ఏనుగు ఎంత క్యూట్‌గా అడుగుతోందో.. పుచ్చకాయల కోసం పరుగు..
ప్రముఖ నటుడి కాఫీ షాపుపై కాల్పులు.. ప్రారంభమైన 3 రోజులకే..