Share News

Baby Elephant: వావ్.. ఈ బుల్లి ఏనుగు ఎంత క్యూట్‌గా అడుగుతోందో.. పుచ్చకాయల కోసం పరుగు..

ABN , Publish Date - Jul 09 , 2025 | 05:29 PM

బుల్లి ఏనుగులు చేసే అల్లరి చాలా క్యూట్‌గా, అందంగా ఉంటూ సోషల్ మీడియా జనాలకు నచ్చుతోంది. ఇప్పటికే అలాంటి ఎన్నో వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Baby Elephant: వావ్.. ఈ బుల్లి ఏనుగు ఎంత క్యూట్‌గా అడుగుతోందో.. పుచ్చకాయల కోసం పరుగు..
Baby elephant

ఏనుగులకు (Elephants) సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎంతో భారీ శరీరాలతో ఉండే ఆ ఏనుగులు చక్కటి ప్రవర్తనతో అందరి మన్ననలు పొందుతున్నాయి. ముఖ్యంగా బుల్లి ఏనుగులు (Baby elephant) చేసే అల్లరి చాలా క్యూట్‌గా, అందంగా ఉంటూ సోషల్ మీడియా జనాలకు నచ్చుతోంది. ఇప్పటికే అలాంటి ఎన్నో వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


@AMAZlNGNATURE అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ఏనుగుల గుంపు రోడ్డు మీద వెళ్తోంది. అందులో ఓ బుల్లి ఏనుగు కూడా ఉంది. రోడ్డు పక్కన ఓ ఇంట్లో మహిళ ప్లేట్‌లో పుచ్చకాయ (water melon) ముక్కలు పట్టుకుని ఉండడం ఆ ఏనుగు చూసింది. వెంటనే అటువైపు పరిగెత్తింది. ఆ మహిళ ఆ ముక్కలను ఇస్తే చక్కగా తన తొండంతో తీసుకుని తినేసింది. ఆ బుల్లి ఏనుగును చూసి మరో ఏనుగు కూడా అక్కడకు వచ్చి పుచ్చకాయ ముక్కలు తినేసింది.


ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోను ఇప్పటివరకు 43 లక్షల మందికి పైగా వీక్షించారు. 1.14 లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఇందుకే బుల్లి ఏనుగులంటే నాకెంతో ఇష్టం అని ఒకరు కామెంట్ చేశారు. మనుషులతో చక్కగా కలిసిపోవడంలో ఏనుగులను మించిన వన్యప్రాణులు లేవని ఇంకొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఇదేం ఆత్రం బాబాయ్.. మద్యం షాప్‌నకు వెళ్లి అతడు చేసిన పని చూస్తే నవ్వకుండా ఉండలేరు..


ఈ ఫొటోలో పక్షిని కనిపెట్టగలిగితే.. మీ కళ్ల గురించి ఆలోచించనక్కర్లేదు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 09 , 2025 | 05:29 PM