Share News

Man Surprise To Wife: రూపాయి, రూపాయి కూడబెట్టి భార్యకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భర్త..

ABN , Publish Date - Nov 05 , 2025 | 04:14 PM

ఓ భర్త తన భార్యకు గిఫ్ట్ ఇవ్వటం కోసం సంవత్సరం పాటు ఎంతో కష్టపడ్డాడు. రూపాయి రూపాయి కూడ బెట్టాడు. ఎట్టకేలకు ఆ చిల్లర డబ్బులతో భార్యకు గిఫ్ట్ కొనేశాడు.

Man Surprise To Wife: రూపాయి, రూపాయి కూడబెట్టి భార్యకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భర్త..
Man Surprise To Wife

భార్యా భర్తల బంధం చాలా గొప్పది. ఆ బంధానికి విలువ ఇచ్చే వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. నూటికి 70 శాతం మందికి పెళ్లి అనేది ఓ అవసరం లాంటిది. భాగస్వామిని ఓ వస్తువులా చూస్తారే తప్ప గౌరవించరు. ఒకరిపై ఒకరు స్వచ్ఛమైన ప్రేమను చూపించుకునే దంపతులు చాలా తక్కువమంది ఉంటారు. తాజాగా, ఓ భర్త తన భార్యకు అదిరిపోయే గిఫ్ట్ ఒకటి ఇచ్చాడు. ఇందుకోసం సంవత్సరం పాటు ఎంతో ఓపిగ్గా రూపాయి, రూపాయి కూడ బెట్టాడు.


పెద్ద మొత్తంలో చిల్లర డబ్బులతో భార్యకు ఆ గిఫ్ట్ కొన్నాడు. ఆ భర్త ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసుకోవాలంటే ఈ మొత్తం స్టోరీ చదవాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన 22 ఏళ్ల అభిషేక్ యాదవ్‌కు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో సంవత్సరం క్రితం పెళ్లయింది. భార్యకు గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇవ్వాలని అభిషేక్ అనుకున్నాడు. పాన్ షాపు నిర్వహిస్తున్న అతడి దగ్గర చైన్ కొనేంత డబ్బు లేదు. దీంతో ప్రతీ రోజూ కొన్ని 20 రూపాయల నాణేలను దాచి పెట్టేవాడు.


అలా సంవత్సరం నుంచి రెండు బ్యాగుల నిండా 20 రూపాయల నాణేలు దాచి పెట్టాడు. శనివారం ఆ రెండు బ్యాగులతో మహదేవ్ వర్మ గోల్డ్ జ్యువెలరీ షాపునకు వెళ్లాడు. ఆ చిల్లర డబ్బులు చూసి షాపు యజమాని మొదట షాక్ అయ్యాడు. అసలు విషయం తెలిసి సంతోషించాడు. ఆ చిల్లర తీసుకుని గోల్డ్ అమ్మడానికి ఒప్పుకున్నాడు. అభిషేక్ తన భార్య కోసం ఓ చైన్ ఎంచుకున్నాడు. ఆ చైన్ ధర 1,25,000 రూపాయలు. అభిషేక్ తెచ్చిన 20 రూపాయల నాణేల విలువ 1,05,000 మాత్రమే. అభిషేక్ ఆలోచన్లో పడ్డాడు. అయితే, షాపు యజమాని అభిషేక్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. మిగిలిన 20 వేలు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో కట్టమన్నాడు. దీంతో సంతోషంగా అభిషేక్ చైన్‌ను తీసుకెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఇవి కూడా చదవండి

38 ఏళ్ల మహిళతో 19 ఏళ్ల యువకుడి ఎఫైర్.. ఊహించని విధంగా..

జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్

Updated Date - Nov 05 , 2025 | 04:15 PM