Share News

Business Idea: ఇంట్లో కంప్యూటర్ ఉంటే చాలు.. ఈ ఐడియాతో లక్షల్లో సంపాదన..

ABN , Publish Date - Jan 20 , 2025 | 08:24 PM

ఇంట్లోనే ఉంటూ మంచి ఆదాయం వచ్చే ఐడియా కోసం వెతుకుతున్నారా.. అందుకు మీ దగ్గర కంప్యూటర్ ఉంటే చాలు.. ఈ ఐడియాతో ఇంట్లో కూర్చునే లక్షల్లో సంపాదించవచ్చు..

 Business Idea: ఇంట్లో కంప్యూటర్ ఉంటే చాలు.. ఈ ఐడియాతో లక్షల్లో సంపాదన..
Low Investment Business Idea

Business Idea: ఈ చాలీచాలనీ జీతం కోసం ఎన్నాళ్లని ఒకరి కింద పనిచేయాలి. సొంతంగా ఏదైనా బిజినెస్ చేద్దాం అని కోరుకునేవారు ఎందరో. అయితే, అందరికీ సమస్య వచ్చేది పెట్టుబడి దగ్గరే. తక్కువ పెట్టుబడితో లాభాలు తెచ్చిపెట్టే వ్యాపారం ఏంటా అని తెగ వెతికేస్తుంటారు. నష్టాలు రాని మంచి బిజినెస్ ఐడియా ఉంటే అప్పు చేసైనా పెట్టుబడి పెట్టేందుకు వెనుకాడరు. అదేంటో తెలీకే చాలామంది ఆలోచన దగ్గరే ఆగిపోతారు. ఆచరణలో ముందడుగు వేయరు. కొందరమో టాలెంట్, ఐడియాలు పుష్కలంగా ఉన్నా ఉద్యోగం రాక, వ్యాపారం చేసేందుకు పెట్టుబడి లేక ఖాళీ ఉంటూ ఇంట్లో తిట్లు తింటుంటారు. ప్రశాంతంగా సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకుని జీవితంలో ఎలాగైనా డబ్బు సంపాదించాలి అని భావిస్తుంటారు. అయితే, డబ్బు సంపాదించాలంటే బిజినెస్ ఒక్కటే మార్గం కాదు. ఇంట్లో కంప్యూటర్ ఉండి.. కాస్త టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఈ ఐడియాతో లక్షల్లో సంపాదించవచ్చు..


జీవితాంతం ఉద్యోగిగా బతకాలని నేటి తరం కోరుకోవడం లేదు. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా సొంతంగా చేసుకునే మార్గం ఏముందా అని అన్వేషిస్తున్నారు. బిజినెస్ చేస్తేనే మంచి సంపాదన వస్తుందని తెలిసీ తెలియక కొందరు చేతులు కాల్చుకుంటారు. నష్టం వస్తుందనే భయంతో ఆసక్తి ఉన్నా ప్రయత్నించడం మానేస్తారు. నష్టపోకుండా బాగా సంపాదించాలని ఆశించేవారికోసమే ఈ ఐడియాలు..


ఈ రోజుల్లో అన్ని వయసుల వారికి సోషల్ మీడియాపై అవగాహన ఉంది. స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక పాలిటిక్స్ గురించి తెలుసుకునే వారి సంఖ్యా బాగా పెరిగింది. పెద్దగా చదువుకోనివారైనా టెక్నాలజీని వాడి ట్రోల్స్ వీడియోలు, రీల్స్ చేస్తున్నారు. ఈ అవగాహనే పెట్టుబడిగా పెడితే చాలు. మీరే ఓ పది మందికి పని కల్పించే స్థాయికి ఎదగవచ్చు. అదెలాగో చూద్దాం..


సోషల్ మీడియాలో ఖాతాలు లేని ప్రముఖులు ప్రస్తుత కాలంలో అరుదు. సినీ, రాజకీయ ప్రముఖులు తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు, అప్‌డేట్స్ ఇచ్చేందుకు ట్విట్టర్, ఇన్‌స్టా ఇలా ఏదొక ప్లాట్‌ఫాంలో అకౌంట్లు మెయింటెయిన్ చేస్తున్నారు. పైకి వారే కనిపిస్తున్నా వీటి మెయింటెయిన్ చేసేందుకు ప్రత్యేక నిపుణులతో టీం నియమించుకుని అందుకోసం లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. ప్రజల్లో పబ్లిసిటీ వచ్చేలా చూసుకుంటున్నారు.


సోషల్ మీడియా అకౌంట్స్ నిర్వహణ, ఫొటోషాప్, వీడియో ఎడిటింగ్ స్కిల్స్ ఉంటే మీరు కూడా ఇలాంటి నిపుణుల్లో ఒకరిగా మారవచ్చు. అందుకోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చుని ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలకు అడ్మిన్‌గా పనిచేయవచ్చు. అందుకోసం వారు పంపించిన వీడియోలు, ఫొటోలు, కంటెంట్‪‌ను ఆసక్తికరంగా ఉండేలా రూపొందించి అప్‌లోడ్ చేయడం చేతనైతే చాలు. ఎలాంటి పనితీరు కనబరుస్తున్నారు అనేదాన్ని బట్టి పారితోషికం లభిస్తుంది. ముందుగా చిన్న స్థాయి కంటెంట్ క్రియేటర్లకు సోషల్ మీడియా అడ్మిన్‌గా వ్యవహరించి పనిలో నైపుణ్యం పెంచుకుంటే.. మీరే కొందరిని నియమించుకుని ఈ రంగంలో లక్షల్లో సంపాదించవచ్చు.


ముందుగా ప్రముఖులను సంప్రదించి అవకాశాల కోసం ట్రై చేయాలి. ప్రతిభ నిరూపించుకునేవరకూ కొన్నాళ్లు కష్టపడితే అవకాశాలు ఆటోమేటిక్‌గా మిమ్మల్నే వెతుక్కుంటూ వస్తాయి. పరిచయాలు పెరిగితే సెలబ్రిటీలే సోషల్ మీడియా అడ్మిన్‌గా ఉండమని ఆఫరివ్వచ్చు.


ప్రజల్లో తమకు ఆదరణ ఎలా ఉందని తెలుసుకునేందుకు ఈ రోజుల్లో అన్ని పార్టీలు సర్వే టీంలు నియమించుకుంటున్నాయి. దాని ఆధారంగానే గెలుపోటములపై అంచనా వేసుకుంటున్నారు. పాలిటిక్స్‌పై‌ ఆసక్తి ఉండేవాళ్లు ఈ రంగంలో రాణించేందుకు మంచి అవకాశాలున్నాయి. ముందుగా అప్‌కమింగ్ నేతలకు మీ టాలెంట్ వివరించి వారికి మీపై నమ్మకం కలిగేలా చేయాలి. టాలెంట్ నిరూపించుకుంటే పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌లుగా,పొలిటికల్ అనలిస్ట్‌గా మంచి ఆదాయం పొందవచ్చు. సర్వే టీం నిర్వహించగలిగే స్థాయి ఉంటే మీరే మరో పది మందికి ఉపాధి కల్పించవచ్చు.

Updated Date - Jan 20 , 2025 | 08:24 PM