Share News

IndiGo Mid Air Scare: ఇండిగో కొత్త విమానంలో కాలిన వాసన.. ప్రయాణికుల్లో కలకలం

ABN , Publish Date - Nov 07 , 2025 | 07:22 PM

ఇండిగో విమానంలో ఒక్కసారిగా కాలిన వాసన గుప్పుమనడంతో ప్రయాణికులు తెగ కలవరపడ్డ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రయాణికుల్లో ఒకరు ఈ వీడియోను షేర్ చేశారు.

IndiGo Mid Air Scare: ఇండిగో కొత్త విమానంలో కాలిన వాసన.. ప్రయాణికుల్లో కలకలం
Indigo Flight Viral Video

ఇంటర్నెట్ డెస్క్: ఇండిగో విమానంలో ఒక్కసారిగా కాలిన వాసన వ్యాపించడంతో ప్రయాణికుల్లో కలకలం రేగిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (IndiGo Flight - Burning Smell).

విమానం మార్గమధ్యంలో ఉండగా ఈ ఘటన జరిగిందని ఓ ప్రయాణికుడు పేర్కొన్నారు. అతడు నెట్టింట వీడియోను కూడా షేర్ చేశారు. వాసనకు కారణం ఏంటో తెలియక ఫ్లైట్ సిబ్బంది కూడా కలవరపడ్డారని అన్నాడు. అయితే, ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనేది మాత్రం అతడు వెల్లడించలేదు.

‘విమానం మార్గమధ్యంలో ఉండగా కాలిన వాసన గుప్పుమంది. విమానంలో ఏదో నిప్పంటుకున్నట్టు అనిపించింది. జనాలు తమ చుట్టుపక్కల అంతా తనిఖీ చేశారు. ఎయిర్‌హోస్టస్‌లు కూడా కలవరపడుతూ అంతా వెతికారు. విమానాన్ని వెంటనే ల్యాండ్ చేయాలని ఓ వ్యక్తి సూచించారు. విమానం కొత్తదని సిబ్బంది ఓ ప్రయాణికుడికి చెప్పారు. ఎయిర్‌హోస్టస్‌లు కూడా కొంత కలవరంగా కనిపించారు. ఇప్పటివరకూ ఆ విమానం కేవలం రెండు జర్నీలే చేసిందని అన్నారు. ప్రయాణికులు టెన్షన్ పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వాసనకు గల కారణమేంటో మాకు వివరించలేదు’ అని తెలిపారు. అయితే, విమానం సేఫ్‌గా ల్యాండయ్యిందని తెలిపారు.


ఇక ఈ వీడియో వైరల్ కావడంతో గగనయాన భద్రతపై చర్చ మొదలైంది. విమానం కొత్తది కావడంతో దానిపై ఏదైనా కోటింగ్ వేడికి కాలి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. ఒక్కోసారి ఇంజెన్ల నుంచి కూడా పొగ వస్తుందని తెలిపారు. మరికొందరేమో ఇండిగో సంస్థ సేవాలోపంపై విమర్శలు గుప్పించారు. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


ఇవీ చదవండి:

నగల వ్యాపారి చేతిలో మహిళకు దేహశుద్ధి.. వీడియో వైరల్

రాబోయే 7 రోజులు ఇలా చేసి చూడండి... మీ లైఫ్ మారిపోతుంది

Read Latest and Viral News

Updated Date - Nov 07 , 2025 | 07:29 PM