Share News

Pratyekam : ఒకసారే గర్భం.. రెండోసారి నో నో..ఇండియాను వేధిస్తున్న రెండో సంతానోత్పత్తి సమస్య గురించి తెలుసా?

ABN , Publish Date - Feb 19 , 2025 | 08:13 PM

India's Falling Birth Rate : భారతదేశంలో సంతానోత్పత్తి రేటు ఏటికేడు వేగంగా పడిపోతోంది. నేటితరం జంటలు ఒక బిడ్డ పుట్టగానే రెండో బిడ్డను కనేందుకు నో చెప్పేస్తున్నారు. ప్రస్తుతం ఈ ధోరణి ఇండియాలోని యువ జంటల్లో ఎక్కువగా పెరిగిపోతోంది. ఎందుకిలా జరుగుతోంది.. ఇదే కొనసాగితే దేశానికి కలిగే నష్టాలేంటి..

Pratyekam : ఒకసారే గర్భం.. రెండోసారి నో నో..ఇండియాను వేధిస్తున్న రెండో సంతానోత్పత్తి సమస్య గురించి తెలుసా?
The Rise of Single-Child Families in India

India's Falling Birth Rate: మొదటి బేబీ పుట్టింది.. ఆరోగ్యంగా ఉంది.. కానీ రెండో బేబీ మాత్రం కష్టమైపోయింది. మొదటి బేబి పుట్టి కొంతమందికి ఒక సంవత్సరం అవుతోంది, మరికొందరికి రెండేళ్లు గడిచిపోతున్నాయి అయినా గర్భం దాల్చలేకపోతున్నారు. ఎందుకలా అవుతోంది? ఇది ఇప్పుడు చాలా మందికి ఎదురయ్యే సమస్య. కుటుంబం పెంచుకోవాలనుకుంటున్న దంపతులకు రెండోసారి సంతానోత్పత్తి కష్టంగా మారిపోతోంది. ఒకప్పుడు ఇలాంటివి పెద్దగా వినిపించేవి కావు, కానీ ఇప్పుడు దీనిపై చర్చ ఎక్కువవుతోంది. అసలు మొదటి బేబీకి ఎలాంటి సమస్య లేకుండా పుట్టినప్పుడు, రెండోసారి ఎందుకు ఇంత కష్టం అవుతోంది? దీని వెనుక కారణాలేంటి?


ఇండియాలోసంతానోత్పత్తి సమస్యలు (infertility) పెరుగుతున్నాయి. లెక్కల ప్రకారం 1992-93లో మొత్తం వంధ్యతా రేటు 22.4శాతం ఉండగా, 2005-06 నాటికి అది 25.3శాతానికి పెరిగింది. 2015-16 నాటికి ఈ రేటు 30.7శాతానికి చేరింది. అందులోనూ, ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్న సమస్య రెండవ సంతానోత్పత్తి! అంటే, మొదటి సారి సులభంగా గర్భం దాల్చిన మహిళ.. రెండోసారి గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కొటోంది. ఇది మామూలు వంధ్యత కంటే భిన్నమైనది. సాధారణంగా, వంధ్యత అంటే ఏదో ఒక కారణం వల్ల గర్భం దాల్చలేకపోవడం. కానీ రెండవ సంతానోత్పత్తి అంటే, ముందుగా గర్భం దాల్చిన వారు రెండోసారి గర్భం దాల్చడంలో సమస్యలు ఎదుర్కొనడం. కొన్ని సందర్భాల్లో, మొదటి గర్భం మిస్క్యారేజ్ అయినా కానీ తర్వాత గర్భం దాల్చలేకపోవచ్చు.


కారణాలు ఏంటి?

మహిళలకు 35 సంవత్సరాలు దాటిన తర్వాత గర్భధారణ అవకాశాలు తగ్గిపోతాయి. అండాల గుణనిల్వ, నాణ్యత తగ్గిపోతుంది. పురుషుల విషయంలో 40 ఏళ్ల తర్వాత వీర్య నాణ్యత తగ్గిపోతుంది. ఇక నేటి జీవనశైలి కూడా దీనికి ఒక ప్రధాన కారణం. పెళ్లి ఆలస్యం, ఉద్యోగ ప్రాధాన్యత, స్ట్రెస్, శారీరక వ్యాయామం లేకపోవడం, ఆల్కహాల్, పొగ త్రాగడం, డ్రగ్స్ వాడటం వంటివి సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి. అటు PCOS, ఎండోమెట్రియోసిస్ , థైరాయిడ్ సమస్యలు లాంటివి గర్భధారణను ప్రభావితం చేస్తాయి. గతంలో గర్భస్రావం కావడం, డెలివరీ సమయంలో ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఫలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం వల్ల గర్భం దాల్చడం కష్టమవుతుంది. ఇక పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండడం కూడా ప్రధాన సమస్యల్లో ఒకటి.

మొదటి సారి గర్భం దాల్చినవారు సమస్య ఎదుర్కొంటారనే విషయం చాలా మందికి తెలియదు. మొదటి సారి పిల్లలైన తర్వాత, రెండోసారి ఇబ్బంది పడతారని చాలా మందికి తెలియదు. అందుకే, ఇది పెద్దగా చర్చలోకి రాదు.


ఎలా నివారించవచ్చు?

  • ఇది పూర్తిగా నివారించలేనప్పటికీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గర్భధారణ అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది.

  • ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం

  • తగినంత వ్యాయామం చేయడం

  • అల్కహాల్, పొగ త్రాగడం మానేయడం

  • స్ట్రెస్ తగ్గించుకోవడం

  • ఆరోగ్య సమస్యలు ఉంటే ముందుగా వైద్యులను సంప్రదించడం

  • గర్భస్రావాలు, అనవసరమైన మెడికల్ ప్రొసీడ్యూర్‌లను తగ్గించడం


చికిత్సలు ఉన్నాయా?

ఈ సమస్యకు కారణాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒవల్యూషన్ సమస్య ఉంటే, మందుల ద్వారా చికిత్స అందిస్తారు. ఫలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయితే, ల్యాపరోస్కోపీ లేదా హిస్టరోస్కోపీ ద్వారా చికిత్స చేయవచ్చు. హార్మోనల్ సమస్య ఉంటే, హార్మోన్ ట్రీట్మెంట్ అవసరమవచ్చు. పురుషుల్లో వీర్య నాణ్యత సమస్య ఉంటే, ప్రత్యేకంగా మందులు లేదా లైఫ్‌స్టైల్ మార్పులతో దీన్ని మెరుగుపరచొచ్చు.


Read Also : పెందుర్తి నర్సింగ్ కాలేజ్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజనింగ్.. విద్యార్థులకు అస్వస్థత..

బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందన్న కోహ్లీ..

ఢిల్లీ సీఎంను ప్రకటించిన బీజేపీ.. అందరి అంచనాలు తారుమారు..

Updated Date - Feb 19 , 2025 | 08:14 PM