AI Birthday Video: వామ్మో.. ఏఐ ఇంత పవర్‌ఫుల్లా.. ఈ వీడియో చూస్తే..
ABN , Publish Date - Jul 17 , 2025 | 06:27 PM
ఏఐతో చేసిన ఓ బర్త్‌డే పార్టీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అసలైన బర్త్ డే పార్టీ రికార్డింగ్‌ను పోలినట్టు ఉన్న ఈ వీడియోను చూసి జనాలు షాకైపోతున్నారు. ఏఐ పవర్ మామూలుగా లేదంటూ కుప్పలు తెప్పలుగా కామెంట్స్ పెడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధ పవర్ ఏంటో కళ్లకు కట్టినట్టు చూపించే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన జనాలందరూ షాకైపోతున్నారు. ఇక ఏఐకి తిరుగేలేదంటూ కామెంట్ చేస్తున్నారు. జస్టిన్ మూర్ అనే మహిళ ఈ వీడియోను షేర్ చేశారు.
ఇది ఓ భారతీయ జంట తమ బిడ్డ పుట్టిన రోజు పార్టీని జరుపుకుంటున్న వీడియో. చిన్నారి తల్లి కేక్ తెచ్చి టేబుల్ మీద పెడితే పిల్లలు క్యాండిల్స్‌ను ఆర్పి సెలబ్రేట్ చేసుకున్నారు. పాత కాలం నాటి కెమెరాతో రికార్డు చేసినట్టు ఉన్న ఈ వీడియోలోని దృశ్యాలన్నీ నిజమనిపించేలా ఉంటాయి. కానీ ఇదంతా ఏఐతో సృష్టించిన వీడియో. ఈ విషయాన్ని సదరు నెటిజన్ తన పోస్టులో స్పష్టంగా పేర్కొన్నారు. ‘ఇది ఎవరి ఇంట్లోనో జరిగిన బర్త్‌డే పార్టీ వీడియో కాదు. ఏఐతో చేసినది. ఏఐతో హెచ్‌డీ వీడియోలే కాదు, ఇలాంటి వీడియోలను కూడా తీయొచ్చు. ఇవి భవిష్యత్తులో కుప్పలు తెప్పలుగా రానున్నాయి’ అని ఆమె పేర్కొన్నారు.
ఇక ఈ వీడియోను చూసి జనాలు షాకైపోతున్నారు. ఇది అచ్చు ఎవరి ఇంట్లోనో తీసుకున్న వీడియోలా ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజమేమిటో తెలియనంతగా ఏఐ వీడియోలు ఉండటంపై కొందరు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఇక భారతీయుల ఆశ్చర్యానికి అయితే అంతే లేకుండా పోయింది. అసలైన భారతీయ కుటుంబాల్లోని దృశ్యాలకు మించి ఈ వీడియో ఉందని కామెంట్ చేశారు. రాబోయే రోజుల్లో ఏఐకి పట్టపగ్గాలు ఉండవనేందుకు ఇది నిదర్శనమని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ట్రెండింగ్‌లో కొనసాగుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
మలేషియాకు వెళ్లొచ్చాక కనువిప్పు.. మన పరిస్థితి తలుచుకుని సిగ్గుపడుతున్నానంటూ భారతీయుడి పోస్టు
రూ.కోటి శాలరీతో బెంగళూరు స్టార్టప్ సంస్థ జాబ్ ఆఫర్.. కాలేజీ డిగ్రీ లేకున్నా పర్లేదని క్లారిటీ