Share News

Pink Rolls Royce: సంవత్సరం పాపకు 12 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి..

ABN , Publish Date - Jun 22 , 2025 | 04:40 PM

Pink Rolls Royce: సతీష్.. తన భార్య, కూతురితో కలిసి రోల్స్ రాయిస్ షోరూముకు వచ్చాడు. కారును రివీల్ చేసిన తర్వాత షోరూము సిబ్బందితో కలిసి పాప ముద్దు, ముద్దుగా డ్యాన్స్ చేసింది.

Pink Rolls Royce: సంవత్సరం పాపకు 12 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి..
Pink Rolls Royce

ఎదుటి వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నామో చెప్పడానికి గిఫ్ట్‌లు ఇవ్వటం అన్నది సర్వసాధారణంగా జరిగే విషయం. మన తాహతను బట్టి, ఎదుటి వ్యక్తి మీద ఉండే ప్రేమ లోతును బట్టి గిఫ్ట్‌లో తేడాలు ఉంటాయి. తాజాగా, ఓ వ్యక్తి ఫాదర్స్ ‌డే సందర్భంగా తన కూతురికి ప్రపంచం మొత్తం తిరిగి చూసే గిఫ్ట్ ఇచ్చాడు. సంవత్సరం వయసున్న పాపకు ఏకంగా 12 కోట్ల రూపాయలు విలువ చేసే రోల్స్ రాయిస్ కారు గిఫ్ట్ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే.. ఇండియాకు చెందిన బిజినెస్ మ్యాన్ సతీష్ సన్‌పాల్ దుబాయ్‌లో స్థిరపడ్డాడు.


సతీష్‌కు ఆనక్స్ డెవలప్‌మెంట్స్ అనే 300 కోట్లు విలువ చేసే వ్యాపారం నడుపుతున్నాడు. ఆయనకు ఇసబెల్లా అనే కూతురు ఉంది. ఇసబెల్లా వయసు ఒక సంవత్సరం. మాటలు రాని, సరిగా నడవలేని ఆ కూతురి కోసం సతీష్ కోట్లు ఖర్చు పెడుతూ ఉంటాడు. ఫిబ్రవరి 18వ తేదీన జరిగిన పాప పుట్టిన రోజును అత్యంత ఘనంగా జరిపాడు. బాలీవుడ్ సెలెబ్రిటీలను సైతం పిలిపించి, పార్టీలో డ్యాన్సులు చేయించాడు. ఫాదర్స్ డే సందర్భంగా పాపకు పింక్ రోల్స్ రాయిస్ కారు గిఫ్ట్ ఇచ్చాడు.


ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. సతీష్.. తన భార్య, కూతురితో కలిసి రోల్స్ రాయిస్ షోరూముకు వచ్చాడు. కారును రివీల్ చేసిన తర్వాత షోరూము సిబ్బందితో కలిసి పాప ముద్దు, ముద్దుగా డ్యాన్స్ చేసింది. తర్వాత పాపను కారు దగ్గరకు తీసుకెళ్లారు. సతీష్ కారు కీని కూతురికి ఇచ్చాడు. పాప కీని పట్టుకుని తండ్రితో పాటు ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.


ఇవి కూడా చదవండి

ఇరాన్‌పై అమెరికా దాడి.. తీవ్రంగా ఖండించిన పాక్..

సింగయ్య కేసు.. A2గా వైఎస్ జగన్!

Updated Date - Jun 22 , 2025 | 07:41 PM