Share News

Aunty ji funny video: ఈ ఆంటీ తెలివి చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే.. వీడియో వైరల్..

ABN , Publish Date - Oct 30 , 2025 | 05:19 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కొన్ని ఫన్నీ వీడియోలు చాలా మందికి నవ్వు తెప్పిస్తున్నాయి.

Aunty ji funny video: ఈ ఆంటీ తెలివి చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే.. వీడియో వైరల్..
Aunty ji funny video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కొన్ని ఫన్నీ వీడియోలు చాలా మందికి నవ్వు తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది (funny video).


sumit_confused అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక మధ్య వయసు మహిళ షాపింగ్ చేసి రెండు పెద్ద బ్యాగ్‌లు పట్టుకుని వెళ్తోంది. మార్గమధ్యంలో వెయింగ్ మెషిన్ చూసి అక్కడకు వెళ్లింది. తన చేతిలో ఉన్న బ్యాగ్‌లను పక్కన పెట్టకుండానే వెయింగ్ మెషిన్ మీద నిలబడింది. బ్యాగ్‌లను పక్కన పెట్టడం మర్చిపోయింది. చివరకు తాను బరువు బాగా పెరిగినట్టు భావించి కిందకు దిగింది (hilarious moment).


ఒక వ్యక్తి ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది ( laughter video). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు పది లక్షల మంది వీక్షించారు. 1.3 లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. కొన్ని రోజుల తర్వాత ఆమె మళ్లీ చెక్ చేసుకుని ఏకంగా పది కిలోలు తగ్గినట్టు భావించి సంతోషపడుతుందని ఒకరు కామెంట్ చేశారు. ఆమె తెలివికి సలాం అని ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

ఆమెకు 18.. అతడికి 55.. వీరి విచిత్రమైన ప్రేమకథ గురించి తెలిస్తే..

మీ తెలివికి పరీక్ష.. ఈ కొండ మీదున్న మరో మనిషిని 20 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 30 , 2025 | 05:19 PM