Couple Climbs Police Vehicle: పోలీసులు పట్టుకున్నా భయపడలేదు.. ఏకంగా పోలీస్ జీప్‌పైకి ఎక్కి..
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:48 AM
పోలీసులు అతి కష్టం మీద వారిని కిందకు దించారు. ఇద్దరినీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. జీప్ ఎక్కి అల్లరి చేసినందుకు గానూ పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు.
తాగిన మైకంలో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. ఏకంగా పోలీసులకే చుక్కలు చూపించింది. పోలీస్ జీప్‌పైకి ఎక్కి రచ్చ రచ్చ చేసింది. ఈ సంఘటన రాజస్తాన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి ఓ జంట రామ్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డుపై వెళుతూ ఉంది. ఓ చోట పోలీసులు కనిపించగానే ఆ జంట పరుగులు పెట్టింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వారిని వెంబడించి పట్టుకున్నారు. వారినుంచి అవసరమైన వివరాలు సేకరించారు.
యువతి వయసు 17 సంవత్సరాలు ఉంటుంది. యువకుడి వయసు 22 సంవత్సరాలు ఉంటుంది. యువతి ఇంటినుంచి పారిపోయి యువకుడితో పాటు వచ్చింది. ఇద్దరూ తప్పతాగి రోడ్డుపై వెళుతూ పోలీసులకు చిక్కారు. పోలీసులు వారిని స్టేషన్‌కు తీసుకెళ్లడానికి జీప్‌లోకి ఎక్కమన్నారు. అయితే, వారు జీప్‌లోకి కాకుండా జీప్‌పైకి ఎక్కారు. కిందకు దిగలేదు. 10 నిమిషాల పాటు జీప్‌పైన రచ్చ రచ్చ చేశారు. ‘ప్లీజ్.. నన్ను, నా లవర్‌ను అరెస్ట్ చేయకండి’ అంటూ ఆ యువతి గట్టిగట్టిగా అరవసాగింది.
పోలీసులు అతి కష్టం మీద వారిని కిందకు దించారు. ఇద్దరినీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. జీప్ ఎక్కి అల్లరి చేసినందుకు గానూ పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ‘నిండా పాతికేళ్లు కూడా లేకుండా మందు తాగుతున్నారంటే.. పెళ్లి చేసుకుంటే వారి భవిష్యత్తు ఊహించలేనంత దారుణంగా ఉంటుంది’..‘ఇలాంటి వారి ప్రేమలు నెలలు కూడా నిలబడవు’..‘మరీ తప్పతాగినట్లు ఉన్నారు. పోలీసులకు కూడా భయపడ్డం లేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నేడు ఉత్కంఠకు తెర.. బోనస్ ప్రకటించనున్న రాష్ట్ర ప్రభుత్వం..
ప్రియురాలిని చంపి.. శవంతో సెల్ఫీ దిగిన ప్రియుడు..