Helicopter crash: గాల్లో గింగిరాలు కొట్టిన హెలికాఫ్టర్.. ఎలా కుప్పకూలిపోయిందో చూడండి..
ABN , Publish Date - Oct 12 , 2025 | 06:08 PM
అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన షాకింగ్ యాక్సిడెంట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. హెలికాఫ్టర్ గాల్లోనే గింగిరాలు కొడుతూ నేల రాలిపోయింది. శనివారం మధ్యాహ్నం హంటింగ్టన్ బీచ్‌లో ఈ షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన షాకింగ్ యాక్సిడెంట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. హెలికాఫ్టర్ గాల్లోనే గింగిరాలు కొడుతూ నేల రాలిపోయింది. శనివారం మధ్యాహ్నం హంటింగ్టన్ బీచ్‌లో ఈ షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Huntington Beach helicopter crash).
పసిఫిక్ కోస్ట్ హైవే సమీపంలోని హంటింగ్టన్ స్ట్రీట్‌లో ఈ ప్రమాదం జరిగింది (viral crash video). గాల్లో ఉండగానే హెలికాఫ్టర్ బ్యాలెన్స్ కోల్పోయింది. పైలెట్ నియంత్రించలేకపోవడంతో అది గాల్లోనే కాసేపు గింగిరాలు తిరిగింది. కాసేపటికి నేల మీద కూలిపోయింది. ఆ హెలికాఫ్టర్‌లో ఇద్దరు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ హెలికాఫ్టర్‌లోని ఇద్దరు వ్యక్తులతోపాటు నేల మీద ఉన్న మరో ముగ్గురు ఈ ప్రమాదంలో గాయపడినట్టు సమాచారం.
బీచ్‌లో ఉన్న కొందరు యువకులు హెలికాప్టర్ కూలిపోవడాన్ని గమనించి వీడియో తీశారు (helicopter crash footage). ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే హంటింగ్టన్ బీచ్ పోలీస్ డిపార్ట్‌మెంట్, అగ్నిమాపక విభాగం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితిపై మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదు.
ఇవి కూడా చదవండి..
అదృష్టం అంటే ఇదే.. పెద్ద ప్రమాదం నుంచి ఎలా తప్పించుకుందో చూడండి..
పాము అంటే పులికీ భయమే.. ఎలా వెనకడుగు వేసిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..