Heartbreaking Toddlers: అమ్మ మందు తాగడానికి వెళ్లింది.. కంటతడి పెట్టిస్తున్న పసి పిల్లల వీడియో..
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:44 PM
తాగుడుకు బానిస అయిన ఓ తల్లి తన ఇద్దరు పిల్లల్ని వదిలి బస్టాండ్ దగ్గర వదిలి వెళ్లిపోయింది. ఆ పిల్లలు చలిలో తల్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గంటలు గడుస్తున్నా తల్లి తిరిగిరాలేదు. దీంతో ఆ పిల్లల్ని పోలీసులు తీసుకెళ్లిపోయారు. తల్లి కోసం అన్వేషిస్తున్నారు.
ఈ సృష్టిలో అమ్మను మించిన గొప్ప వారు ఎవరూ లేరు. తల్లి తన పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఇచ్చేస్తుంది. అయితే, కొంతమంది మాత్రం అమ్మ అన్న పదానికే మచ్చ తెచ్చుస్తున్నారు. తమ సంతోషం కోసం బిడ్డలను కష్టాల పాలు చేస్తున్నారు. ఇందుకు మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
సోమవారం ఉదయం ఉజ్జయినిలోని దివాస్ గేట్ బస్టాండ్ దగ్గర ఓ తల్లి తన ఇద్దరు పిల్లల్ని వదిలి వెళ్లిపోయింది. ఆ పిల్లలు చలిలో తల్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గంటలు గడుస్తున్నా తల్లి తిరిగిరాలేదు. దీంతో ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు బస్టాండ్ దగ్గరకు చేరుకున్నారు. పిల్లల్ని ‘మీ అమ్మ ఎక్కడ?’అని అడిగారు. వారు చెప్పిన సమాధానం విని వారు షాక్ అయ్యారు.
‘మా అమ్మ మందు తాగడానికి వెళ్లింది’ అని అన్నారు. పోలీసులు స్థానికుల నుంచి పిల్లల వివరాలు సేకరించారు. వారిని 3 ఏళ్ల ఖాన్సీ, 2 ఏళ్ల కాళీగా గుర్తించారు. తాగుడుకు బానిస అయిన తల్లి వారిని అక్కడ వదిలేసి వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు. ఆ పిల్లల్ని వారితో పాటు తీసుకెళ్లారు. పిల్లల తల్లి కోసం అన్వేషిస్తున్నారు. బస్టాండ్ పరిధిలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ పిల్లల తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నువ్వసలు తల్లివేనా?’ అంటూ మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
థ్రిల్లింగ్ వీడియో.. అనకొండను వేటాడడం అంత ఈజీ కాదు.. చిరుత పరిస్థితి చూడండి..
కేంద్రం కీలక నిర్ణయం.. రాజ్‌భవన్ పేరు లోక్ భవన్‌గా మార్పు..