Tribal man eats rasgulla: భారతీయ రసగుల్లా తిన్న ఆఫ్రికన్ ట్రైబల్ వ్యక్తి.. అతడి రియాక్షన్ చూస్తే..
ABN , Publish Date - Aug 28 , 2025 | 04:16 PM
ఆఫ్రికా ఖండంలో బయటి ప్రపంచాన్ని చూడని చాలా తెగలు ఇప్పటికీ ఉన్నాయి. నిజం చెప్పాలంటే వారు 21వ శతాబ్దంలో కూడా ఆదిమ మానవుల జీవితాన్ని గడుపుతున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కొంతమంది ట్రావెల్ వ్లాగర్లు ఆఫ్రికాలోని వివిధ తెగలను సందర్శించి వారి జీవన విధానాన్ని గమనిస్తుంటారు.
ఆఫ్రికా ఖండంలో బయటి ప్రపంచాన్ని చూడని చాలా తెగలు ఇప్పటికీ ఉన్నాయి. నిజం చెప్పాలంటే వారు 21వ శతాబ్దంలో కూడా ఆదిమ మానవుల జీవితాన్ని గడుపుతున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కొంతమంది ట్రావెల్ వ్లాగర్లు ఆఫ్రికాలోని వివిధ తెగలను సందర్శించి వారి జీవన విధానాన్ని గమనించి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చూపిస్తున్నారు. తాజాగా ఒక ట్రావెల్ వ్లాగర్ ఆఫ్రికన్ హడ్జాబే తెగకు చెందిన వారిని కలిసి వారితో మాట్లాడాడు (Hadzabe hunter rasgulla).
roamingvinu అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ట్రావెల్ వ్లాగర్ ఇటీవల టాంజానియాలోని వేటకు ప్రసిద్ధి చెందిన హడ్జాబే తెగకు సంబంధించిన వారితో సమయం గడిపాడు. వారికి పార్లే జి బిస్కెట్లు, టీ, రసగుల్లా వంటి భారతీయ వంటకాలను రుచి చూపించాడు. ఈ వీడియోలో హడ్జాబే తెగకు చెందిన వ్యక్తికి రసగుల్లాను ఇవ్వడం కనిపిస్తోంది. ఆ రసగుల్లాను రుచి చూసిన ఆ వ్యక్తి ఎంతో సంబరపడిపోయాడు. ఆనందంతో గెంతులు వేశాడు (Hadzabe tries Indian food).
రసగుల్లా తిని అతడు ఇచ్చిన రియాక్షన్ (rasgulla first time reaction) ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 50 లక్షల మందికి పైగా వీక్షించారు. 2.3 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. చిన్నప్పుడు పాలపొడి తిన్నప్పుడు తాను ఇంతే సంతోషపడ్డానని ఒక వ్యక్తి కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఈ పాము చాలా సంస్కారవంతమైనది.. మొబైల్‌లో అశ్లీల పాట చూసి ఏం చేసిందంటే..
రూ.100 పెట్టి షేర్ కొంటే.. రూ.3000 భోజనం ఫ్రీ.. ఆ రోజులు పోయాయంటే సీఏ ఆసక్తికర పోస్ట్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..