Share News

Grandmother Holds Drip Bottle: మరీ ఇంత దారుణమా.. వృద్ధురాలన్న కనికరం కూడా లేకుండా..

ABN , Publish Date - Aug 18 , 2025 | 02:00 PM

Grandmother Holds Drip Bottle: మధ్య ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఓ వృద్ధురాలితో దారుణంగా వ్యవహరించారు. ఆమెతో 30 నిమిషాల సేపు సెలైన్ బాటిల్ ఎత్తి పట్టుకునేలా చేశారు. ఈ సంఘటన సత్నాలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పాటెల్ జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

Grandmother Holds Drip Bottle: మరీ ఇంత దారుణమా.. వృద్ధురాలన్న కనికరం కూడా లేకుండా..
Grandmother Holds Drip Bottle

ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం తారాస్థాయికి చేరుకుంది. మనుషుల ప్రాణాలు పోతున్నాయన్నా కూడా కొందరు డాక్టర్లు పట్టించుకోవటంలేదు. కొద్దిరోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌లో ఓ డాక్టర్ రోగికి వైద్యం చేయకుండా హాయిగా నిద్రపోయాడు. దీంతో ఆ రోగి చనిపోయాడు. మరో ఘటనలో గాయాలతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తితో డాక్టర్లు అత్యంత ఘోరంగా ప్రవర్తించారు. మురికిపట్టిన నేలపై పడుకోబెట్టి ఎక్స్‌రే తీశారు. ఇలా తరచుగా ఏదో ఒక ఘటన వెలుగుచూస్తూనే ఉంది.


తాజాగా, మధ్య ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఓ వృద్ధురాలితో దారుణంగా వ్యవహరించారు. ఆమెతో 30 నిమిషాల సేపు సెలైన్ బాటిల్ ఎత్తి పట్టుకునేలా చేశారు. ఈ సంఘటన సత్నాలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పాటెల్ జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మైహార్‌కు చెందిన 35 ఏళ్ల అశ్వినీ మిశ్రా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో అశ్వీని మిశ్రా నాన్నమ్మ అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లింది. డాక్టర్లు చికిత్స చేసిన తర్వాత అతడికి సెలైన్ బాటిల్ పెట్టారు.


అయితే, అక్కడ డ్రిప్ స్టాండ్లు లేవు. డాక్టర్లు కానీ, మిగిలిన సిబ్బంది కానీ, సెలైన్‌ను ఎక్కడైనా ఫిక్స్ చేసే ప్రయత్నం చేయలేదు. దాన్ని వృద్ధురాలి చేతిలో పెట్టి పట్టుకోమన్నారు. ఒలంపిక్ జ్యోతిని పట్టుకున్నట్లు ఆమె ఆ సెలైన్ బాటిల్‌ను పట్టుకుని నిలబడింది. దాదాపు అరగంట పాటు అలానే ఉండిపోయింది. పాపం చెయ్యి నొప్పితో నరకం చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. డాక్టర్లపై, ఇతర సిబ్బందిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ప్రముఖ మోడల్‌ను బలి తీసుకున్న దుప్పి.. అత్యంత దారుణమైన స్థితిలో..

ఇలాంటి నటుడ్ని చూసుండరు.. దెయ్యం పట్టినట్లు యాక్టింగ్ ఇరగదీశాడు..

Updated Date - Aug 18 , 2025 | 02:06 PM