Giant Wheel Swing Collapses: జెయింట్ వీల్ ప్రమాదం.. చావు కేకలతో ఒక్కసారిగా అలజడి..
ABN , Publish Date - Sep 28 , 2025 | 03:26 PM
జెయింట్ వీల్ తిరగటం మొదలైన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఠక్కున ఓ వైపు కుప్పకూలింది. జెయింట్ వీల్ ఎక్కిన జనం గుండెలు ఝల్లుమన్నాయి. భయంతో గట్టిగా అరవటం మొదలెట్టారు.
జాతర్లు లేదా తిరుణాళ్లు జరిగినపుడు జెయింట్ వీల్ సందడి సర్వసాధారణంగా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గరినుంచి పెద్ద వారి వరకు జెయింట్ వీల్ ఎక్కుతూ ఉంటారు. జెయింట్ వీల్ అటూ, ఇటూ తిరుగుతూ ఉంటే.. లోపల కూర్చున్న వారు కేరింతలు కొడుతుంటారు. అయితే, జెయింట్ వీల్ కారణంగా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా లేకపోలేదు. తాజాగా, మధ్య ప్రదేశ్‌లో తృటిలో ఓ పెను విషాదం తప్పింది. జెయింట్ వీల్ కుప్పకూలటంతో 20 మంది ప్రాణాల మీదకు వచ్చింది.
పోలీసులు, జెయింట్ వీల్ సిబ్బంది సకాలంలో స్పందించటంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రైసెన్ జిల్లాలోని ఖండెరా ధామ్ గుడిలో నవరాత్రి ఉత్సవాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గుడి ప్రాంగణంలో జెయింట్ వీల్ ఏర్పాటైంది. ఆదివారం ఉదయం ఓ 20 మంది జెయింట్ వీల్ ఎక్కారు. జెయింట్ వీల్ తిరగటం మొదలైన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఠక్కున ఓ వైపు కుప్పకూలింది. జెయింట్ వీల్ ఎక్కిన జనం గుండెలు ఝల్లుమన్నాయి.
భయంతో గట్టిగా అరవటం మొదలెట్టారు. దీంతో పోలీసులు, జెయింట్ వీల్ సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. గాల్లో వేలాడుతున్న వారిని క్షేమంగా కిందకు దించారు. ఈ సంఘటనలో ఎవ్వరికీ ఏమీ కాలేదు. దీనిపై దేవ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మాట్లాడుతూ..‘ ఆ జెయింట్ వీల్ మ్యానువల్‌గా రన్ అవుతుంది. కాలి ద్వారా దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఓ హుక్ విరిగిపోయింది. దీంతో అలజడి మొదలైంది. ప్రస్తుతం ఆ జెయింట్ వీల్ తీసేశారు’ అని చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
కరూర్ విషాదంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టుకు టీవీకే
పదేళ్లు సమయం ఇవ్వండి.. న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతా..: సీఎం రేవంత్‌రెడ్డి