Share News

Woman Stabs Husband: భార్య ఘాతుకం.. అశ్లీల రీల్స్ చేయొద్దన్నాడని భర్తపై కత్తితో దాడి..

ABN , Publish Date - Aug 29 , 2025 | 08:58 PM

భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె కత్తితో అతడిపై దాడికి యత్నించింది. అతడి సంకలో బిడ్డ ఉన్న కూడా ఆగలేదు. అతడి మీదకు ఉరికింది. పక్కన ఉన్నవారు అడ్డుకోవటంతో పెను ప్రమాదం తప్పింది.

Woman Stabs Husband: భార్య ఘాతుకం.. అశ్లీల రీల్స్ చేయొద్దన్నాడని భర్తపై కత్తితో దాడి..
Woman Stabs Husband

అశ్లీల రీల్స్ చేయొద్దని అన్నందుకు ఓ భార్య భర్తపై దారుణానికి ఒడిగట్టింది. కత్తితో అతడిపై దాడి చేసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు, భర్త తెలిపిన వివరాల మేరకు.. ఘజియాబాద్, లోని ప్రాంతానికి చెందిన అనీస్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. 13 ఏళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. భార్యాభర్తలు ఓ కూతురు, కొడుకుతో ఎంతో సంతోషంగా ఉండేవారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరి కాపురంలో ఇన్‌స్టాగ్రామ్ చిచ్చు పెట్టింది.


అనీస్ భార్యకు 2024 నుంచి రీల్స్ పిచ్చి పట్టుకుంది. పరాయి మగాళ్లతో కలిసి అశ్లీల రీల్స్ చేస్తూ ఉంది. అనీస్ వద్దని ఎంత చెప్పినా వినటం లేదు. తమకు అడ్డం వస్తే తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని ఆమె భర్తను బెదిరించింది. ఆమెకు ప్రియుడు కూడా ఉన్నాడు. సీక్రెట్‌గా అతడ్ని కలుస్తూ ఉండేది. 2024, డిసెంబర్ నెలలో ప్రియుడితో ఉన్న భార్యను అనీస్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. తన ఫోన్‌లో వారి వీడియోను చిత్రీకరించాడు. అయితే, భార్య ఆ ఫోన్‌ను దాచేసింది. తన నిజస్వరూపం బయటకు తెలియకుండా జాగ్రత్తపడింది. తర్వాతి నుంచి ఆమె ఆగడాలు పెరుగుతూ పోయాయి.


సోషల్ మీడియా అటెన్షన్ కోసం పెట్రోల్ పోసుకుని రీల్స్ చేస్తానని భర్తను బెదిరించేది. ఆమె అనుచరులు కూడా అనీస్‌పై బెదిరింపులకు పాల్పడేవారు. తాజాగా, భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె కత్తితో అతడిపై దాడికి యత్నించింది. అతడి సంకలో బిడ్డ ఉన్న కూడా ఆగలేదు. అతడి మీదకు ఉరికింది. పక్కన ఉన్న యువతి అడ్డుకోవటంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే భర్తకో, బిడ్డకో కత్తి పొడుచుకునేది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఈ యూట్యూబర్ మామూలోడు కాదు.. పగలు నీతులు.. రాత్రి దొంగతనాలు..

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. స్తంభించిన జనజీవనం..

Updated Date - Aug 29 , 2025 | 09:58 PM