Change Your Life YouTuber: ఈ యూట్యూబర్ మామూలోడు కాదు.. పగలు నీతులు.. రాత్రి దొంగతనాలు..
ABN , Publish Date - Aug 29 , 2025 | 07:52 PM
మనోజ్‌కు ‘ఛేంజ్ యువర్ లైఫ్’ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్‌లో మోటివేషనల్ వీడియోలు పెడుతుంటాడు. ప్రజల్ని తన మాటల్తో మోటివేట్ చేస్తున్నాడు.
కొంతమంది చెప్పే మాటలకు, చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు. పైకి నీతులు చెబుతూ.. లోలోపల పాడు పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో కూడా ఓ యూట్యూబర్ పగలు ప్రజలకు నీతులు చెబుతూ.. రాత్రిళ్లు దొంగతనాలకు పాల్పడేవాడు. చివరకు పోలీసులకు దొరికి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ సంఘటన ఒడిస్సాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్, భరత్‌పూర్ ఏరియాకు చెందిన మనోజ్ సింగ్ యూట్యూబర్‌గా రానిస్తున్నాడు.
అతడికి ‘ఛేంజ్ యువర్ లైఫ్’ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్‌లో మోటివేషనల్ వీడియోలు పెడుతుంటాడు. ప్రజల్ని తన మాటల్తో మోటివేట్ చేస్తున్నాడు. పగలు జనాలకు నీతులు చెప్పే ఈ పెద్ద మనిషి రాత్రి అయితే చాలు దొంగగా మారిపోతాడు. భరత్‌పూర్ ఏరియాలో 10కిపైగా దొంగతనాలకు పాల్పడ్డాడు. మనోజ్‌పై కేసులు కూడా నమోదు అయ్యాయి. ఆగస్టు 14వ తేదీన ఓ ఇంట్లో దొంగతనం చేశాడు. 200 గ్రాముల బంగారం, 5 లక్షల నగదు దోచుకెళ్లిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మనోజ్ పాత నేరస్తుడు కావటంతో పోలీసులు అతడిపై ఓ వారం పాటు నిఘా పెట్టారు. దొంగిలించిన బంగారం, లక్ష రూపాయల నగదుతో ఖండగిరి బరి ఏరియాలో అతడు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ సంఘటనపై పోలీస్ కమిషనర్ ఎస్ దేవ్ దత్తా సింగ్ మాట్లాడుతూ.. ‘అతడు దొంగతనాలు చేయటంలో నిపుణుడు. ఇప్పటి వరకు 10 కేసులు అతడిపై ఉన్నాయి. ఖాళీ టైమ్‌లో యూట్యూబ్‌లో మోటివేషనల్ క్లాసులు చెబుతుంటాడు. ఆ వీడియోలకు మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. స్తంభించిన జనజీవనం..
అసెంబ్లీలో గొడవ.. కొట్టుకున్న ప్రతిపక్ష, అధికార పార్టీ నాయకులు..