Gas Stove Cleaning Tips: మీ గ్యాస్ స్టవ్ తళతళ మెరిసిపోవాలంటే.. ఈ టిప్స్ పాటించండి..
ABN , Publish Date - Jan 24 , 2025 | 02:20 PM
కిచెన్ రూంలోని గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడం పెద్ద టాస్క్. నూనె మరకలు, మసాలా మరకలు పోవలంటే ఎక్కువ సమయం పడుతుంది. అయితే, ఈ టిప్స్‌తో అతి తక్కువ టైంలోనే మీ గ్యాస్ స్టవ్‌ను శుభ్రంగా ఉంచుకోండి..
Gas Stove Cleaning Tips: ఇంట్లో కిచెన్ రూం శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా గ్యాస్ స్టవ్ క్లీన్‌గా పెట్టుకోవాలి. అయితే, దీనిని క్లీన్ చేయడం పెద్ద టాస్క్. ఎందుకంటే ఇది ఎక్కువగా జిడ్డుగా ఉంటుంది. నూనె మరకలు, మసాలా మరకలు అంత ఈజీగా పోవు. వాటిని శుభ్రం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి, ఈ టిప్స్ ను పాటించి అతి తక్కువ టైంలోనే మీ గ్యాస్ స్టవ్‌ను శుభ్రంగా ఉంచుకోండి..
నిమ్మకాయ..
గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడానికి నిమ్మకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిమ్మరసం, దాని తొక్క సహాయంతో గ్యాస్ స్టవ్‌ను శుభ్రంగా పెట్టుకోవచ్చు. జిడ్డు మరకలు ఈజీగా తొలగిపోతాయి. గ్యాస్ స్టవ్‌ను నిమ్మ తొక్కతో బాగా రబ్ చేసి కాసేపు తర్వాత నీటితో క్లీన్‌ను చేయండి.
బేకింగ్ సోడా..
బేకింగ్ సోడాతో మీగ్యాస్ స్టవ్‌ను తళతళ మెరిసేలా చేసుకోవచ్చు. బేకింగ్ సోడా కొద్దిగా తీసుకుని అందులో నిమ్మరసం లేదా వైట్ వెనిగర్ కలపి పేస్ట్‌లా చేసుకోండి.. ఆ పేస్ట్‌ని గ్యాస్ స్టవ్‌పై నేరుగా అప్లై చేసి కాసేపు తర్వాత క్లీన్ చేయండి.
వెనిగర్..
వెనిగర్‌ను ఎక్కువగా ఇంట్లోని మచ్చలు పోగొట్టేందుకు వాడుతుంటాం. కిచెన్‌లో గ్యాస్ స్టవ్‌పై మరకలు ఉంటే ముందుగా కాస్తా వెనిగర్ తీసుకుని ఆ మరకలపై కొద్దిగా చల్లండి. ఐదు నిమిషాలు అలానే ఉంచి ఆ తర్వాత స్టవ్ ను క్లీన్ చేయండి. ఇలా చేయడం వల్ల జిడ్డు మరకలు ఈజీగా పోతాయి.
డిష్ వాష్ లిక్విడ్..
డిష్ వాష్ లిక్విడ్ కేవలం గిన్నెలు క్లీన్ చేసేందుకు మాత్రమే కాదు.. స్టవ్ మరకలను పోగొట్టేందుకు కూడా ఉపయోగపడుతుంది. స్టవ్‌పై మరకలు ఉంటే స్పాంజిపై కొద్దిగా లిక్విడ్ వేసి బాగా కడగండి. గ్యాస్ స్టవ్ క్లీన్‌గా అవుతుంది.
ఉల్లిపాయలతో..
ఉల్లిపాయలను గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి కూడా వాడొచ్చు. కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని 20 నిమిషాల పాటు నీటిలో ఉడికించాలి. ఈ నీటిని చల్లార్చిన తర్వాత గ్యాస్ స్టవ్‌పై స్ప్రే చేయండి. ఐదు నిమిషాలు అలానే ఉంచి తర్వాత క్లీన్ చేయండి. ఇలా చేయడం వల్ల గ్యాస్ స్టవ్ పై జిడ్డు మరకలు ఈజీగా పోతాయి.
Also Read: విటమిన్ డి కావాలా.. ఎండలో ఎప్పుడు, ఎంతసేపు కూర్చోవాలి..