Share News

Simple Techniques Check Empty Gas Cylinder: గ్యాస్ సిలిండర్ ఎప్పుడు అయిపోతుందో.. తెలుసుకునే సింపుల్ చిట్కాలు

ABN , Publish Date - Sep 29 , 2025 | 03:49 PM

కొన్ని కుటుంబాలకు ఒక గ్యాస్ బండ కనెక్షన్ మాత్రమే ఉంటుంది. మరికొన్ని కుటుంబాలకు రెండు గ్యాస్ కనెక్షన్లు ఉంటాయి. అయితే ఒక గ్యాస్ కనెక్షన్ ఉన్న వారు.. బండ అయిపోయిన తర్వాత బుకింగ్ చేసుకుంటారు. దీని వల్ల వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాదు.. బుకింగ్ చేసిన బండ వచ్చే వరకు.. ఎదురు చూపులు తప్పవు.

Simple Techniques Check Empty Gas Cylinder: గ్యాస్ సిలిండర్ ఎప్పుడు అయిపోతుందో.. తెలుసుకునే సింపుల్ చిట్కాలు
Simple Techniques Empty Gas Cylinder:

వంటింట్లో సిలిండర్ పెట్టి.. నెల రోజులు దాటింది. సిలిండర్‌లో గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో.. ఏమిటో? అనే ఒక విధమైన చిన్నపాటి ఒత్తిడితో కూడిన ఆందోళన దాదాపు ప్రతి ఇంట్లోని కుటుంబ సభ్యుల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో సిలిండర్‌లో గ్యాస్‌ను తనిఖీ చేయడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి.


సిలిండర్ ఖాళీ అయిందని ఎలా గుర్తించాలంటే..?

సిలిండర్ వెనుక భాగంలో కొద్దిగా వేడి నీటిని పోయాలి. కొన్ని సెకన్ల తర్వాత ఆ ప్రదేశాన్ని చేతితో తాకండి. గ్యాస్ ఉన్న భాగం చల్లగా ఉంటుంది. గ్యాస్ లేని భాగం వేడిగా ఉంటుంది. ఇది సిలిండర్‌లో మిగిలిన ఉన్న గ్యాస్ స్థాయిని త్వరగా గుర్తించడానికి సహయ పడుతుంది.


రెండో పద్దతి..

డిజిటల్ వెయిటింగ్ మిషన్ ఉపయోగించి.. సిలిండర్ బరువును కొలవ వచ్చు. సాధారణంగా.. ఖాళీ సిలిండర్ 15 కిలోల బరువు ఉంటుంది. కానీ సిలిండర్ బరువు 18 నుంచి 19 కేజీలు చేరుకుంటే.. గ్యాస్ త్వరలోనే అయిపోతుందని అర్థం చేసుకోవాలి.


మూడో చిట్కా..

గ్యాస్ స్టవ్ మీద వంట చేసేటప్పుడు.. నీలి రంగ మంట వస్తుంది. అదే ఆ మంట రంగు పుసుపు రంగులోకి మారితే.. లేదా చిన్న మంట కానీ వస్తే మాత్రం బండలో గ్యాస్ తక్కవగా ఉందని అర్థం చేసుకోవాలి. అదీకాక వంట సమయం.. సాధారణంగా కంటే ఎక్కువ తీసుకుంటే.. గ్యాస్ అయిపోతున్నట్లు పరిగణించాలి.


ఇక మార్కెట్‌లో గ్యాస్ ఇండికేటర్ స్టిక్కర్లు అందుబాటులో ఉంటాయి. వీటిని సిలిండర్‌పై అతికించాలి. అవి రంగు మారితే సిలిండర్‌లో గ్యాస్ స్థాయిని సూచిస్తుంది.


మరోవైపు సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన వారు.. స్మార్ట్ గ్యాస్ మానిటర్లను ఉపయోగించ వచ్చు. వీటిని సిలిండర్ కింద ఉంచుతారు. సిలిండర్‌లో గ్యాస్ స్థాయిని మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షించ వచ్చు.


అయితే గ్యాస్ అయిపోతుందని తెలిసిన వెంటనే.. గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవాలి. అలా అయితే.. గ్యాస్ అయిపోయే వేళకు.. ఇంటికి గ్యాస్ సిలిండర్ వస్తుంది. దీంతో గ్యాస్ సిలిండర్ వచ్చే వరకు వేచి చూసే బాధ తప్పుతుంది. ఇది ఒక సిలిండర్ కనెక్షన్ ఉన్న వారికి ప్రయోజనం.


అదే రెండు సిలిండర్లు ఉన్న వారికి.. ఒక గ్యాస్ బండ అయిపోతే.. ఇంట్లోని రెండో గ్యాస్ బండను అమర్చుకోవచ్చు. ఆ వెంటనే గ్యాస్ బుక్ చేసుకుంటే.. ఒకటి రెండు రోజుల్లో గ్యాస్ బండ ఇంటికి వస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్

విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు

For More Prathyekam and Telugu News

Updated Date - Sep 29 , 2025 | 03:49 PM