Ganesh Chaturthi in Pakistan: పాకిస్థాన్‌లో వినాయక నిమజ్జనం.. రోడ్డు మీద వారు ఎలా చూస్తున్నారంటే..
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:53 PM
ప్రస్తుతం దేశవ్యాప్తంగా గణపతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎవరి శక్తి కొలదీ వారు వినాయక మండపాలను ఏర్పాటు చేసుకుని పూజించారు. అనంతరం వినాయక నిమజ్జనాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా గణపతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎవరి శక్తి కొలదీ వారు వినాయక మండపాలను ఏర్పాటు చేసుకుని పూజించారు. అనంతరం వినాయక నిమజ్జనాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. మన దేశంలోనే కాదు.. పాకిస్థాన్ (Pakistan)లో కూడా కొందరు హిందువులు వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహించారు. అంతేకాదు.. వైభవంగా నిమజ్జన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు (Ganesh immersion Karachi).
పాకిస్థాన్‌లోని కరాచీలో గణపతి నవరాత్రి ఉత్సవాలను అక్కడి హిందువులు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం భారీ వినాయక విగ్రహాన్ని ఓ ఆటోలో పెట్టి నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు (Ganesh Visarjan Pakistan 2025). ఆ సమయంలో 'గణపతి బప్పా మోరియా' అంటూ సాంప్రదాయ ధోల్ సంగీతానికి నాట్యం చేశారు. వారిని చూసి రోడ్డు మీద ఉన్న చాలా మంది ముస్లింలు ఆశ్చర్యపోయారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Hindu festival in Karachi).
ఈ వైరల్ వీడియోను కేవలం మూడు రోజుల్లోనే కోట్ల మంది వీక్షించారు. 14 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. అన్ని ధర్మాలకు చోటివ్వడం మానవ ధర్మం అని ఒకరు కామెంట్ చేశారు. పాకిస్థాన్‌లోని వినాయకుడి విగ్రహం ఎలా దొరికింది అంటూ ఒకరు ప్రశ్నించారు. పాకిస్థాన్‌లో ఇలా చేయాలంటే చాలా ధైర్యం కావాలని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇన్ని తెలివితేటలు ఎక్కడివి భయ్యా.. ఈ బైక్‌ను దొంగిలించడం ఎవరి తరమూ కాదు..
మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ ఫొటోలో మిస్టేక్ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..